టాక్ ఎలా వున్నా కలెక్షన్స్ కుమ్ముడు మాములుగా ఉండదు

Update: 2018-01-10 10:00 GMT

అజ్ఞాతవాసి చిత్రం ప్రపంచవ్యాప్తంగా నేడు బుధవారమే విడుదలైంది. అయితే చిత్రం పై ఉన్న భారీ అంచనాలను అజ్ఞాతవాసి అందుకోలేదనే చెప్పాలి. సినిమా ప్రీమియర్ షో నుండే మిక్స్డ్ టాక్ వచ్చేసింది. కేవలం పవన్ ఫాన్స్ చిత్రంగా ప్రచారం మొదలైంది. కేవలం పవన్ కళ్యాణ్ కున్న క్రేజ్ తో ఈ చిత్రం దూసుకెళ్తుంది. అజ్ఞాతవాసి చిత్రం ఇప్పటికే అమెరికాలో బాహుబలి ది బిగినింగ్ చిత్ర కలెక్షన్లు దాటడం విశేషం. రాత్రి 8:45 నిమిషాల వరకు 478 లొకేషన్లలో అజ్ఞాతవాసి 1.42మిలియన్ డాలర్లతో నిలిచింది. అదే సమయానికి బాహుబలి ది బిగినింగ్ 1.36 మిలియన్ డాలర్లతో ఉంది. దాంతో ఇన్నాళ్లు బాహుబలి ది బిగినింగ్ పేరిట ఉన్న రికార్డును అజ్ఞాతవాసి తడిచిపెట్టేసింది.

ఇప్పటివరకు ఈ లిస్ట్ లో మొదటి స్థానంలో బాహుబలి ది కంక్లూషన్ చిత్రం 2.46మిలియన్ డాలర్లతో ఉంది. మొదటిరోజే ఈ చిత్రం 1మిలియన్ డాలర్ల మార్కును అందుకుంది. 2మిలియన్ వైపు పరుగులు తీస్తున్న ఈ చిత్రం ఎంత కల్లెక్షన్ల రాబడుతుందో తెలియాలంటే కాస్త వెయిటింగ్ తప్పేలా లేదు. మొదటిరోజే బాహుబలి కల్లెక్షన్లలను కొల్లగొట్టిన అజ్ఞాతవాసి చిత్రం తెలుగు రాష్ట్రాల్లో కూడా భారీ కలెక్షన్ల దిశగా దూసుకెళ్తుంది, పవన్ కళ్యాణ్ గత చిత్రాలు బాక్స్ ఆఫీస్ వద్ద నిరాశ పరిచినా ఈ చిత్రం పై ఆ అనుమానాలు ఏమి లేవు. మరోవైపు ఈ చిత్రం పవన్ కళ్యాణ్ 25వ చిత్రం కావడం, త్రివిక్రమ్ వంటి దర్శకుడితో పవన్ పనిచేయడంతో ఈ చిత్రం కలెక్షన్లు పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి.

మరి పవన్ అభిమానులు ఏకంగా అజ్ఞాతవాసి చిత్రం 400 నుండి 500కోట్లు కొల్లగొడుతుందనే అంచనా వేయగా.. ట్రేడ్ వర్గాల లెక్కల ప్రకారం ఈ చిత్రం 150 నుండి 200కోట్ల కలెక్షన్లు సాధించే అవకాశం కనిపిస్తుంది. భారీ ఓపెనింగ్స్ తోపాటు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్రం కోసం స్పెషల్ పర్మిషన్లు ఇస్తుండడంతో రోజువారీ కలెక్షన్లు ఇంకా పెరిగే అవకాశం ఉంది. సంక్రాంతి సీజన్ కావడం... వరుసగా సెలవలు అరవడంతో ఏ సినిమా కలెక్షన్స్ కి ఏ మాత్రం ఢోకా ఉందంటున్నారు... రేపు శుక్రవారం విడుదలయ్యే జై సింహ, గ్యాంగ్ సినిమాలను తట్టుకుని అజ్ఞాతవాసి బాక్సాఫీసు వద్ద ఎలా నిలబడతుందో చూద్దాం.

Similar News