జోడి కలిసిరాకపోయినా ఆ భామనే కోరుకున్న యువ హీరో

Update: 2018-01-30 09:14 GMT

యంగ్ హీరో రామ్ పెద్ద స్టార్ హీరో ఐపోతాడని అనుకున్న వారు అధిక సంఖ్యలోనే వున్నారు అతడి కెరీర్ స్టార్టింగ్ లో జోరు చూసి. కానీ రాను రాను రామ్ మూస ధోరణి కథలని ఎంపిక చేసుకోవటానికి అలవాటు పడిపోయి కందిరీగ, పండుగ చేస్కో వంటి హిట్స్ వచ్చినప్పటికీ అతని టార్గెట్ ఐన క్లాస్ ప్రేక్షకుల మనసులు దోచుకోలేకపోయాడు. నేను శైలజ తో ఆ లోటు తీర్చుకున్నప్పటికీ హైపర్ చిత్రంతో ఎదురు దెబ్బ తిని వున్నది ఒక్కటే జిందగీ తో కూడా తన డౌన్ ఫాల్ నుంచి బైట పడలేకపోయాడు.

వున్నది ఒకటే జిందగీ చిత్రంలో అనుపమ పరమేశ్వరన్, లావణ్య త్రిపాఠి లతో ఆడిపాడిన రామ్ ఆ చిత్రం పెద్దగా ఆడనప్పటికీ, ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ పై ఉన్న నమ్మకంతో తన తదుపరి చిత్రంలో కూడా అనుపమ పరమేశ్వరన్ కి అవకాశం కలిపించాడు. త్రినాధరావు నక్కిన దర్శకత్వంలో తెరకెక్కబోయే ఈ చిత్రానికి దిల్ రాజు నిర్మాత. మార్చ్ ప్రథమార్ధం లో ఈ చిత్రం సెట్స్ పైకి వెళ్లనుంది.

Similar News