జీవితపై గుణశేఖర్ ఫైర్

Update: 2017-11-18 14:00 GMT

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రకటించిన నంది అవార్డుల మీద వివాదం కొనసాగుతూనే ఉంది. తాజాగా గుణశేఖర్ తన మనసులో ఉన్న బాధను మీడియాతో పంచుకున్నాడు. నంది అవార్డుల జ్యూరీ చైర్మన్ జీవిత మాట్లాడిన మాటలు తనకు బాధ కలిగించాయని, బాహుబలి చిత్రం తరువాతైనా తమ రుద్రమను పరిగణలోకి తీసుకోకపోవడం అన్యాయమని ఆయన అన్నారు. జీవిత, ముఖ్యమంత్రి చంద్రబాబును ప్రశంసించి అవార్డులు ఎంతో నిష్పక్షపాతంగా ఇచ్చారని చెప్పిందని గుణశేఖర్ గుర్తు చేశారు.

మానసికంగా క్షోభపెట్టి....

రుద్రమదేవి చిత్రానికి తెలంగాణ ప్రభుత్వం పన్ను రాయితీ ఇచ్చినా ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం మాత్రం ఎలాంటి రాయితీలు ఇవ్వకుండా మానసికంగా క్షోభ పెట్టిందని చెప్పారు. గౌతమీపుత్ర శాతకర్ణి చిత్రానికి ఇవ్వడం గురించి తాను తప్పుపట్టడం లేదని, తన చిత్రానికి ఎందుకివ్వలేదని మాత్రమే ప్రశ్నించానని గుణశేఖర్ చెప్పారు. జాతీయ అవార్డులు, ప్రాంతీయ అవార్డులకు ఎంతో వ్యత్యాసముందని, జాతీయ దృష్టి వేరు, ప్రాంతీయ దృష్టి వేరని ఆయన అన్నారు. తెలుగు జాతి కీర్తిని దశదిశలా వ్యాపింపజేసిన రుద్రమదేవి చిత్రానికి ఆనాడు పన్ను రాయితీ ఇవ్వలేదు, ఈనాడు అవార్డు ఇవ్వలేదు అంటూ గుణశేఖర్ ఆవేదన వ్యక్తం చేశారు.

Similar News