జాగ్రత్త పడుతున్న భరత్

Update: 2018-04-17 06:21 GMT

భరత్ అనే నేను సినిమా బాహుబలి ని చూసి జాగ్రత్త పడుతుంది. బాహుబలి చిత్రం కొన్న వారంతా ఓవర్ అల్ గా హ్యాపీ గా ఉన్నారని అపోహ పడుతుంటారు. చిన్న సెంటర్స్ బాహుబలి సినిమాకి కూడా థర్డ్ పార్టీల వారికి నష్టాలు తప్పలేదు. కొన్ని కాస్ట్‌లీ థియేటర్లలో షో వేస్తే భారీ స్థాయిలో గ్రాస్‌ వసూలు కాకపోతే కొన్నవారికి ఖర్చులు కూడా తిరిగి రావు. అందుకే ఇప్పుడు భరత్ అనే నేను చిత్రంని రిలీజ్ చేస్తున్న గ్రేట్‌ ఇండియా ఫిలింస్‌ సంస్థ ఈ చిత్రానికి తక్కువ లొకేషన్లు ప్లాన్‌ చేస్తోంది.

యూఎస్ లో 320 లొకేషన్స్ ఈ సినిమా రిలీజ్ చేయాలనీ ప్లాన్ చేస్తుంటే ఇంకా కొన్ని చోట్ల వేయాలని డిమాండ్లు వస్తున్నాయి. లోకేషన్స్ కి అందుబాటులో ఉన్న థియేటర్స్ లోనే సినిమా వేయాలనుకుంటున్నారు. బాహుబలి 2 అనుభవం నుంచి ఏ లొకేషన్‌ బెస్ట్‌ అనేది ఐడెంటిఫై చేసి విడుదల చేస్తున్నామని చెబుతున్నారు.

ఎవరికైన తమ ఏరియాలో షో వేసుకోవాలంటే తప్పకుండా తగిన మొత్తం చెల్లించి వేసుకోవచ్చునని ఆ సంస్థ పేర్కొంది. ఓవర్ అల్ గా గ్రాస్ వచ్చే సరికి వసూళ్ల కోసం కాకుండా నష్టాలు రాకుండా థియేటర్‌ యావరేజ్‌ చూసుకుని విడుదల చేయడం శుభ పరిణామమే.

Similar News