జనతా గ్యారేజ్ ఫిఫ్టీ డేస్ ఎక్కడెక్కడంటే..

Update: 2016-10-20 04:15 GMT

సినిమా నికరంగా నాలుగు వారాలు థియేర్లలో నిలబడితే సూపర్ హిట్ కింద పరిగణించే రోజులు వచ్చేసిన సమయంలో.. జూనియర్ ఎన్టీఆర్ , కొరటాల శివ కాంబినేషన్లో వచ్చిన బ్లాక్ బస్టర్ జనతా గ్యారేజ్ ఏకంగా 39 కేంద్రాల్లో 50 రోజులు ఆడుతోంది. ఇవాళ జనతా గ్యారేజ్ ఫిఫ్టీ డేస్ ను పూర్తిచేసుకుంది. ఈ సినిమా ఫిఫ్టీ డేస్ కు థియేటర్ల ప్రాబ్లం రాకుండా.. కల్యాణరామ్ తన ఇజం చిత్రం విడుదలను కూడా అనుకున్న ముహూర్తానికి కాకుండా, 21 వ తేదీకి వాయిదా వేసుకున్న సంగతి తెలిసిందే.

జనతా గ్యారేజ్ ఫిఫ్టీకి సంబంధించి.. రెండు ప్రత్యేకమైన పోస్టర్లను కూడా చిత్రబృందం విడుదల చేశారు. 39 కేంద్రాల వివరాలను కూడా అందులో పేర్కొన్నారు. కంగ్రాట్స్ ఎన్టీఆర్, కంగ్రాట్స్ కొరటాల శివ.

Similar News