జగన్ గా అతను... భారతిగా...?

Update: 2018-03-24 05:42 GMT

ప్రస్తుతం టాలీవుడ్ లో బయోపిక్ లకు క్రేజ్ ఎక్కువ అయిపోయింది. రామ్ గోపాల్ వర్మ..ఎన్టీఆర్ బయోపిక్ అంటున్నాడు కానీ అది ఇప్పట్లో సెట్స్ మీదకి వెళ్లే సూచనలు ఏమి కనిపించట్లేదు. మరోపక్క నందమూరి బాలకృష్ణ తేజ డైరెక్షన్ లో ఎన్టీఆర్ బయోపిక్ ను ప్లాన్ చేసిన సంగతి తెలిసిందే. తర్వరలోనే ఈ సినిమాకు సంబంధించి ఓపెనింగ్ కూడా జరగనుంది.

ఇది ఇలా ఉంటే.. వై.ఎస్.ఆర్. బయోపిక్ కి సంబంధించిన సన్నాహాలు చకచకా జరిగిపోతున్నాయి. 'ఆనందో బ్రహ్మ' సినిమా ఫేమ్ మహి వి. రాఘవ్ ఈ సినిమాకి దర్శకుడిగా వ్యవహరిస్తున్నాడు. ఈ సినిమాలో వైఎస్ఆర్ గా మమ్ముట్టి నటించనున్నట్టు తెలుస్తోంది.

ఇక వై.ఎస్.ఆర్. కొడుకు జగన్ పాత్రలో తమిళ్ నటుడు సూర్య చేయనున్నట్టు ప్రచారం జరుగుతోంది. జగన్ భార్య భారతి పాత్రలో కీర్తి సురేశ్ నటించే అవకాశం వున్నట్టుగా చెబుతున్నారు. విజయ్ చిల్లా .. దేవిరెడ్డి శశి ఈ సినిమాను 30 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిస్తున్నారు. ఈ మూవీకి 'యాత్ర' అనే టైటిల్ ను ఖరారు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. రాజశేఖర్ రెడ్డి పాదయాత్ర చేయడం వల్లనే ముఖ్యమంత్రి అయ్యాడు అని అందుకే ఆ టైటిల్ అనుకున్నట్టు తెలుస్తుంది.

Similar News