చేతులు కాలాక : శంకరాభరణం చేదు జ్ఞాపకమంట

Update: 2016-11-17 16:38 GMT

శేఖర్ కమ్ముల దర్శకత్వంలో అందరూ కొత్త వాళ్ళతో చేసిన కాలేజీ కథ హ్యాపీ డేస్ సాధించిన సక్సెస్ నేటి వరకు మరే కాలేజీ కథ సాధించలేకపోయింది. ఆ చిత్రంలో నైజాం యాసతో మాట్లాడే రాజేష్ పాత్రతో ఆకట్టుకున్న యువ నటుడు నిఖిల్ సోలో హీరోగా స్థిరపడటానికి మాత్రం చాలా సంవత్సరాలే వేచి చూడాల్సి వచ్చింది. యువత చిత్ర పరవాలేదు అనిపించినా 2012 లో విడుదల ఐన స్వామి రారా చిత్రంతో సోలో హీరోగా తొలి సక్సెస్ అందుకున్నాడు. నిఖిల్ సాధించిన హ్యాట్రిక్ సక్సెస్లకి నాంది కూడా ఆ చిత్రమే. వెనువెంటనే కార్తికేయ, సూర్య వర్సెస్ సూర్య చిత్రాలు ప్రేక్షకాదరణ పొందాయి.

వరుస విజయాలతో ఫామ్ లో వున్న నిఖిల్ అప్పటికి మెల్ల మెల్లగా ఫామ్ కోల్పోతున్న రైటర్ కోన వెంకట్ కి ఒక ప్రాజెక్ట్ ఒప్పందం కుదుర్చుకుని బోల్తా పడ్డాడు. ఆ చిత్రమే శంకరాభరణం. ఈ చిత్రానికి కథ, కథనం, సంభాషణలు, సమర్పణ, దర్శకత్వ పర్యవేక్షణ బాధ్యతలు చెప్పటగా ఈ చిత్రం ఘోర పరాజయ చెందిన సంగతి తెలిసిందే. ఈ వైఫల్యం నుంచి బైట పడటానికి నిఖిల్ కి ఏడాది సమయం పట్టింది. ఈ శుక్రవారం ఎక్కడికి పోతావు చిన్నవాడా విడుదల కానుంది. ఈ చిత్ర ప్రచార కార్యక్రమాలలో పాల్గొంటున్న నిఖిల్ తన గత చిత్రం గురించి స్పందిస్తూ శంకరాభరణం ఒక చేదు జ్ఞాపకం అని, ఎవరి ప్రోద్భలంతోను ఏ ప్రాజెక్ట్ ఒప్పుకోకూడదు అనే గుణ పాఠం నేర్పిన చిత్రం గా శంకరాభరణం నిలిచిపోతుంది అని కోన వెంకట్ పేరు ప్రస్తావించకుండా వ్యంగ్య ఆరోపణలు చేసాడు నిఖిల్.

Similar News