చేతిలో హిట్ లేకపోయినా అంతెందుకు...

Update: 2017-09-06 14:00 GMT

లావణ్య త్రిపాఠికి చేతిలో ఓ... అన్నంత హిట్ లేదు. ఏదో చిన్న చితక హీరోలతో కెరీర్ లాగించేస్తుంది. లావణ్య నటించిన 'రాధా, మిష్టర్' చిత్రాలు వరుసగా ప్లాపయ్యాయి. అయితే తనకి గ్లామర్ షో చేసే అవకాశం రావడం లేదని తెగ బాధపడుతున్న ఈ భామకి నాగ చైతన్య 'యుద్ధం శరణం'లో అందాల ఆరబోతకు అవకాశం దొరికింది. తాను ఇప్పటివరకు చేసిన కేరెక్టర్స్ అన్ని కేవలం సంప్రదాయంగా మాత్రమే ఉన్నాయని.... కానీ నాకు మోడ్రెన్ గా ఉండడం ఇష్టమంటూ తన అభిప్రాయాల్ని బహిరంగంగానే చెప్పింది. ఇక ఇప్పుడు లావణ్య చేతిలో రామ్ సినిమా 'ఉన్నది ఒకటే జిందగీ', నాగ చైతన్య 'యుద్ధం శరణం' వంటి చిత్రాల్తోపాటు ఒక తమిళ సినిమా కూడా వుంది. తమిళంలో లావణ్య త్రిపాఠి 'మాయావన్' సినిమాలో చేస్తుంది. ప్రస్తుతానికి మాయావన్ మూవీ ప్రీ ప్రొడక్షన్ పనుల్లో నిమగ్నమై ఉంది.

అయితే లావణ్య త్రిపాఠి పరుశరామ్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ హీరోగా బన్నీ వాస్ నిర్మాతగా తెరకెక్కుతున్న సినిమాలో హీరోయిన్ గా ఎంపికైనట్లు వార్తలొచ్చాయి. అయితే లావణ్య ఈ సినిమా కోసం తన పారితోషకం అమాంతం పెంచేసిందట. మరి చేతిలో సరైన హిట్ లేకపోయినా లావణ్య మాత్రం తన పారితోషకం పెంచడంతో దర్శకనిర్మాతలు లావణ్యని పక్కన పెట్టి ఆ స్థానంలోకి కన్నడ ముద్దగుమ్మ రష్మిక మడోన్నాని సెలెక్ట్ చేశారనే విషయం చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది.

అయితే లావణ్య తన పారితోషకం పెంచడంతోనే చిత్ర బృందం ఆ నిర్ణయం తీసుకుందంటున్నారు. అసలే హీరోయిన్స్ కి హిట్స్ లేకపోతె వారికి క్రేజ్ కూడా ఉండదు. మరి అలాంటి టైం లో లావణ్య అంత గీరగా తన పారితోషకం పెంచడం అనేది మాత్రం ఆలోచించే విషయమే.

Similar News