చెర్రీ సినిమా మిగిల్చిన నష్టాలతో ఆత్మ హత్య దిశగా ఆలోచనలు

Update: 2017-02-06 04:39 GMT

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్-ఎస్.ఎస్.రాజమౌళి కాంబినేషన్ లో వచ్చిన మగధీర ఇండస్ట్రీ హిట్ గా నిలిచి తెలుగు చిత్ర పరిశ్రమలో తొలి 50 కోట్ల రూపాయల వసూళ్లు సాధించిన చిత్రంగా చరిత్రలో కొత్త అధ్యయనాలు రచించటంతో రామ్ చరణ్ తేజ్ నటించిన తదుపరి చిత్రం ఆరెంజ్ పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఆ అంచనాలకు తగ్గట్టుగానే ఆ సినిమాకి ప్రీ రిలీజ్ బిజినెస్ బాగా జరగటం, ఆరెంజ్ చిత్రాన్ని భారీ వ్యయంతో నిర్మించిన మెగా బ్రదర్ కొణిదల నాగ బాబు ఆ చిత్రం మిగిల్చిన ఆర్ధిక నష్టాలను భరిస్తూ బయ్యర్లకు డబ్బులు వెనక్కి ఇచ్చి సెటిల్ చేయాల్సి రావటం అప్పట్లో పెద్ద సంచలనమే ఐయింది. ఆరెంజ్ చిత్రం కమెర్షియల్ గా ఘోరమైన పరాజయం అని అందరికి తెలిసినప్పటికీ నిర్మాత నాగ బాబు మాత్రం ఆరెంజ్ మిగిల్చిన చేదు జ్ఞాపకాల గురించి స్పందించటానికి ఎప్పుడూ ఇష్టపడలేదు. కానీ తాజాగా నాగ బాబు ఇచ్చిన ఒక కాన్డిడ్ ఇంటర్వ్యూలో ఆరెంజ్ విడుదల అనంతరం తన మానసిక పరిస్థితిని వివరిస్తూ ఎమోషన్ అయ్యారు.

"ఆరెంజ్ కోసం మేము ఫారిన్ షెడ్యూల్స్ లో ఎక్కువ షూటింగ్ చేయటం వల్ల మాకు బడ్జెట్ కంట్రోల్ కాలేదు. పైగా అది డిసాస్టర్ అవటంతో నా కష్టాలు తీవ్ర స్థాయికి చేరాయి. ఆరెంజ్ మిగిల్చిన ఆర్ధిక నష్టాలను భరించటానికి నేను అప్పటికి ఉంటున్న విలాసవంతమైన అద్దె ఇంటి నుంచి మరో చిన్న ఇంటికి మారాల్సి వచ్చింది. అప్పటికి నా ఆదాయం కూడా ఇంత ఉండేది కాదు. ప్రతి పైసా చూసుకుని ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి ఎదురు ఐయ్యింది. ఒక్క కార్ తప్ప మిగతావన్నీ అమ్మేసాను. ఒక్కో నెల గడిచే సరికి అన్నయ్య దగ్గరో, కళ్యాణ్ బాబు దగ్గరో డబ్బులు తీసుకోవాల్సి వచ్చినప్పుడు నాకు ఆత్మ హత్య చేసుకోవాలనిపించింది. ఆ సమయంలో మా అన్నయ్య, కళ్యాణ్ ఇచ్చిన సహకారం అంతా ఇంతా కాదు. వారి ప్రమేయంతోనే నా మానసిక పరిస్థితి కుదుటపడి తిరిగి ఈ స్థాయికి రాగలిగాను." అంటూ నాగ బాబు ఆరెంజ్ చేదు జ్ఞాపకాలని బైట పెట్టారు.

Similar News