చెర్రీ ఇచ్చిన డిసాస్టర్ తో నాలుగేళ్లు అజ్ఞాతంలోకి దర్శకుడు

Update: 2017-02-08 14:51 GMT

చిరుతతో నటజీవితం ప్రారంభించిన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ కమర్షియల్ హీరో గా పలు సక్సెస్లు ఇచ్చినప్పటికీ చెర్రీ కెరీర్లో డిసాస్టెర్స్ అంటే ఆరెంజ్, బ్రూస్ లీ చిత్రాలు మాత్రమే గుర్తొస్తాయి. అయితే ఈ రెంటికి మించిన డిసాస్టర్ జన్జీర్. బాలీవుడ్ లో దశాబ్దాల క్రితం అక్కడి మెగా స్టార్ అమితాబ్ బచ్చన్ నటించిన సూపర్ డూపర్ హిట్ చిత్రం జన్జీర్ చిత్రాన్ని రామ్ చరణ్ తేజ్ కథానాయకుడుగా, ప్రియాంక చోప్రా కథానాయికగా 2013 లో రీమేక్ చేయగా ఈ చిత్రం ఘోర పరాజయం చెంది, పంపిణీదారులకు కనీసం ప్రింట్లు, పోస్టర్లకు ఐన ఖర్చుని కూడా వెనక్కి తీసుకురాలేకపోయింది. జన్జీర్ డిసాస్టర్ నుంచి వెంటనే కోలుకున్న రామ్ చరణ్ తేజ్ ఎవడు వంటి కమర్షియల్ హిట్ తో ఫామ్లోకి రాగా, ఆ చిత్రాన్ని తెరకెక్కించిన దర్శకుడు అపూర్వ లఖియా మాత్రం నాలుగేళ్లు మరో సినిమా మొదలు పెట్టకుండా అజ్ఞాతంలోకి వెళ్ళిపోయాడు.

బొంబాయి సే ఆయా హై మేరె దోస్త్, ఏక్ అజ్నాబీ, షూట్ అవుట్ ఎట్ లోఖండ్వాలా, డ్యూస్ కహానీయాం, మిషన్ ఇస్తాన్బుల్ వంటి ఆసక్తికర చిత్రాలను తెరకెక్కించిన తరువాత రామ్ చరణ్ తో చేసిన డిసాస్టర్ తో ఒక్కసారిగా అప్పోర్వ లఖియా కెరీర్ స్తంభించిపోయింది. ఆ చిత్రం విడుదలైన సరిగ్గా నాలుగు సంవత్సరాల అనంతరం తన తదుపరి ప్రాజెక్ట్ తో తిరిగి బాలీవుడ్ వర్గాలలో ఆసక్తిని క్రియేట్ చేయగలిగాడు ఈ దర్శకుడు. మాఫియా డాన్ దావుద్ ఇబ్రహీం సోదరి హసీనా జీవిత కథతో బయోపిక్ చేస్తున్న అపూర్వ లఖియా ఈ చిత్రం ద్వారా ఎవరికీ తెలియని హసీనా జీవిత కథని చెప్పబోతున్నాడు. దావుద్ ఇబ్రహీం గురించి తెలియని వారు, హసీనా జీవితం గురించి పరిచయం వున్న వారు చాలా చాలా అరుదుగా వుంటారు. అందుకే దావుద్ గురించి చెప్పటం కంటే హసీనా గురించి తన చిత్రం ద్వారా ప్రేక్షకులకి చెప్పటానికి మొగ్గు చూపాడు అపూర్వ లిఖియా. శ్రద్ద కపూర్ టైటిల్ రోల్ పోషిస్తున్న ఈ చిత్రం ఫస్ట్ లుక్ బాలీవుడ్ ప్రముఖుల నుంచి ప్రశంసలు పొందుతుంది. ఈ చిత్రం ఈ ఏడాది జులై 14 న ప్రేక్షకుల ముందుకి రానుంది.

Similar News