చిరుకి చెమటలు పట్టిస్తున్న కాజల్ అగర్వాల్

Update: 2016-11-28 06:27 GMT

మెగా స్టార్ చిరంజీవి అసాధారణమైన అభిమాన ఘనాన్ని సొంతం చేసుకుని తెలుగు చిత్ర పరిశ్రమలో ఏకంగా రెండు దశాబ్దాలు అగ్ర స్థానంలో తిష్ట వేయగలిగినప్పటికీ ఆయన సినిమాల నుంచి తొమ్మిది సంవత్సరాల క్రితం బ్రేక్ తీసుకుంటూ ఆయన కెరీర్ లో ఆయన చేసిన 149 వ చిత్రం, ఆయన తొలి ఇన్నింగ్స్ కి ఆఖరి చిత్రం సంఖర్ దాదా జిందాబాద్. ఆ చిత్రం అంచనాలు అందుకోలేక పరాజయం చవి చూసింది. అక్కడినుంచి రాజకీయ రంగ ప్రవేశం చేసిన చిరుకి చేదు అనుభవాలు వెంట వెళ్లాయి. ఇటీవలి కాలంలో ఆయన ప్రేక్షకులకు తన సినీ జీవితం పునప్రారంబిస్తున్నట్టు సంకేతాలు ఇవ్వటానికి బ్రూస్ లీ లో అతిధి పాత్ర పోషించగా ఆ చిత్రం కూడా పరాభవం చెందింది.

నాటి నుంచి దృష్టి మొత్తం చిరు 150 వ చిత్రం పైనే కేంద్రీకరించింది మెగా ఫామిలీ. కథా చర్చల్లోనే దాదాపు ఏడాదిన్నర్ర కాలం గడిపి కత్తి రీమేక్ వైపు మొగ్గు చూపారు. మాస్ దర్శకుడు వినాయక్ కత్తి కథ లో చిరుకి తగిన మార్పులు అన్నీ చేసి తెరకెక్కించారు. అయినప్పటికీ చిరుకి పూర్తి స్థాయిలో తృప్తి కలగటం లేదు. ఆయనకు సక్సెస్లో హీరోయిన్ సెంటిమెంట్ ప్రభావం చూపుతుంది ఏమో అని భయం పట్టుకుంది. కాజల్ అగర్వాల్ చిరు సరసన ఆది పాడుతుండగా ఈ ఏడాది కాజల్ అగర్వాల్ నటించిన సర్దార్ గబ్బర్ సింగ్, బ్రహ్మోత్సవం, లాఫ్జోమ్ కా కహాని, కావాలి వెందాం చిత్రాలు వరుసగా పరాజయం చెంది కాజల్ బాడ్ టైం ని ఇండికేట్ చేస్తున్నాయి. దీనితో చిరు కం బ్యాక్ చిత్రం పై కాజల్ సెంటిమెంట్ పడుతుంది ఏమో అని మెగా ఫామిలీ ఉక్కిరి బిక్కిరి అవుతుంది.

Similar News