చిరు ఆనందానికి హద్దులు లేవు

Update: 2018-04-01 11:13 GMT

కుమారుడిని ఎవరన్నా పొగిడితే ముందుగా ఆనంద పడేది తండ్రే. ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి అదే ఆనందాన్ని పొందుతున్నాడు. ఇప్పటివరకు రామ్ చరణ్ కమర్షియల్ గా ఎన్ని విజయాలు సాధించినా అవి ఫ్యాన్స్ సపోర్ట్ తోనో లేదా మాస్ ప్రేక్షకుల మెప్పుతోనో సంపాదించుకున్నవి తప్ప చరణ్ బ్రాండ్ కి గర్వంగా చెప్పుకునే విజయం ఇప్పటివరకు ఒక్కటి కూడా లేదు.

అయితే రంగస్థలం సినిమాతో తన సొంత బ్రాండ్ సంపాదించుకున్నాడు. సినిమాలో రామ్ చరణ్ పెర్ఫార్మన్స్ గురించే టాక్ ఎక్కువగా ఉంది అంటే ఏ రేంజ్ లో చరణ్ ఫీడ్ బ్యాక్ అందుకుంటున్నాడో అర్థమవుతుంది. చరణ్ యాక్టింగ్ కు నేషనల్ అవార్డు కచ్చితంగా వచ్చేస్తుందని టాక్స్ కూడా వినిపిస్తున్నాయి. చరణ్ చిట్టి బాబు పాత్ర తెగ నచ్చడంతో పాటు అందరు ప్రశంసలు కురిపించడంతో చిరు తెగ ఆనందపడిపోతున్నాడు.

మొన్న చిత్ర యూనిట్ తో పాటు సందీప్ రెడ్డి..వంశీ పైడిపల్లి తో కలిసి సెలెబ్రేట్ చేసుకునే దాకా ఉండలేకపోయారు చిరు. అక్కడ దిగిన గ్రూప్ ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. మొదటి రోజు కలెక్షన్స్ కూడా ఊహించినదానికంటే ఎక్కువ వచ్చింది. ఓవర్సీస్ లో సైతం అదే జోరు కొనసాగిస్తోంది. బాక్స్ ఆఫీస్ వద్ద రంగస్థలం కచ్చితంగా వండర్స్ క్రియేట్ చేసే అవకాశాలు లేకపోలేదు.

Similar News