చిరంజీవి నుంచి విరాళం తీసుకోవటానికి కారణం ఇదేనట

Update: 2017-04-14 04:49 GMT

మెగా స్టార్ నటించిన సూపర్ హిట్ చిత్రం హిట్లర్ నాటి నుంచి డాన్స్ కొరియోగ్రాఫర్ గా కొనసాగుతున్న రాఘవ లారెన్స్ దానితో పాటు యాక్టింగ్, సంగీతం, స్క్రిప్ట్, డైరెక్షన్ అంటూ చాలా విభాగాలలో తన ప్రతిభ చాటుకునే ప్రయత్నాలు చేసి సక్సెస్ అయ్యాడు. తాను సాధించిన ఈ సక్సెస్ వెనుక తన తల్లి నిరంతర శ్రమ ప్రత్యేక కారణం అని ఎప్పుడూ చెప్పే రాఘవ లారెన్స్ ఆమె ఋణం కొంతైనా తీర్చుకోవాలని ఆలోచనతో తన తల్లికి ఆలయం నిర్మించాడు. తాను చాలా చిన్న వయసులో ఉండగా బ్రెయిన్ ట్యూమర్ వ్యాధి తో అతను బాధపడుతున్నప్పుడు తన తల్లి కనుక లేకపోయినట్లయితే తాను బతికి ఉండేవాడిని కాదని చెప్తున్నా లారెన్స్ ఈ ఆలయం నిర్మించటానికి తాను తీసుకున్న సలహాలు, సూచనలు, తీర్చుకున్న సందేహాల గురించి వివరించాడు.

"నేను మా అమ్మకి ఆలయం కట్టించాలని నా బాల్యంలోనే నిర్ణయానికి వచ్చేసాను. అది సాధ్యపడటానికి నాకు ఇంత కాలం పట్టింది. నేను ఈ ఆలయ నిర్మాణం ప్రారంభించే ముందు ఎన్నో సలహాలు సూచనలు తీసుకున్నాను. మరణించిన వారికి ఆలయాలు నిర్మిస్తుండటం సహజం. అయితే నేను మా అమ్మకి బతికి ఉండగానే ఆలయం నిర్మించదలిచాను. ఆ విషయమై నా సందేహాల్ని తీర్చుకున్నాకే ఆలయ నిర్మాణం ప్రారంభించాను. ఈ ఆలయానికి ముగ్గురి వద్ద నుంచి విరాళాలు పుచ్చుకున్నాను. వారిలో పి.వాసు లక్ష రూపాయలు, ఆర్.బి.చౌదరి 50 వేలు, మెగా స్టార్ చిరంజీవి 3 లక్షలు విరాళంగా ఇచ్చారు. వీరి దగ్గర నుంచి ఆ మొత్తం విరాళంగా తీసుకోవటానికి కారణం పి.వాసు గారు నాతో ఏ ఆలయాన్నైనా ఒక్కరే నిర్మించకూడదు అని చెప్పటం. అందుచేత నేను వారి నుంచి విరాళంగా కొంత సొమ్ముని తీసుకుని అది ఆలయ నిర్మాణానికి వినియోగించాను." అని వివరించాడు రాఘవ లారెన్స్.

Similar News