చిరంజీవి కాకపోతే వీరు ఆ సినిమా చేసేవారు కాదు

Update: 2017-01-23 08:56 GMT

అదృష్టవ శాత్తు మారుతున్న సాంకేతిక పరిజ్ఞానం వల్ల కేవలం తెరపై కనిపించే నటీనటులకు కాక తెర వెనుక కష్టపడే సాంకేతిక నిపుణులకు కూడా గుర్తింపు లభిస్తుంది. అలా ఈ తరం ఛాయాగ్రాహకులలో బాగా గుర్తింపు వున్న ఛాయాగ్రాహకుడు రత్నవేలు. పి.సి.శ్రీరామ్, సంతోష్ శివన్ ల మాదిరిగా పాపులారిటీ తెచ్చుకున్నారు రత్నవేలు. ఆయన కాల్ షీట్స్ దొరకటం కూడా అంత సామాన్యమైన విషయమేమి కాదు. అంత క్రేజ్ వున్న టెక్నీషియన్ కూడా తనకి నచ్చని సినిమాకి కి పని చేశారు. అదే ఖైదీ నెం.150 చిత్రం. తమిళ కత్తి కి రీమేక్ కావటంతో రత్నవేలు ఈ చిత్రానికి పని చేయటానికి పెద్దగా ఆసక్తి చూపలేదట. ఒకసారి తెరకెక్కిన చిత్రానికి పనిచేసేటప్పుడు మన ప్రతిభ కనపరిచే అవకాశం ఉండదు అంటున్నాడు రత్నవేలు.

ఖైదీ నెం.150 చిత్రానికి సినిమాటోగ్రఫీ చేయటం ఎంత మాత్రం ఇష్టం లేనప్పటికీ ఇది మెగా స్టార్ చిరంజీవి నటిస్తున్న చిత్రం కావటంతో రీమేక్ చిత్రం అయినప్పటికీ చిరంజీవితో కలిసి పని చేసే సదావకాశాన్ని వదులుకోలేక అయిష్టం గానే ఈ చిత్రాన్ని ఒప్పుకున్నాడట రత్నవేలు. చిత్రం చూసిన ప్రేక్షకులంతా చిరు ని చాలా యంగ్ గా, అందంగా చూపించారు అని ప్రశంసిస్తుంటే ఇది ఒక రీమేక్ చిత్రమని భావన పోయిందట. మరో పక్క కథానాయిక కాజల్ అగర్వాల్ కూడా ఇటువంటి అభిప్రాయమే వ్యక్తపరిచింది. తమిళ కత్తి లో సమంత పాత్రకి పెద్దగా ప్రాధాన్యత ఏమి లేకపోయినప్పటికీ తెలుగులో ఆ పాత్ర పోషించటానికి కాజల్ అగర్వాల్ ఒప్పుకోవటానికి ఒకేఒక్క కారణం చిరంజీవి సరసన హీరోయిన్ అవకాశం కావటమే అని స్వయంగా కాజలే చెప్పింది. అనుకున్నట్టుగానే చిరంజీవితో కలిసి తెరను పంచుకోవాలనే కోరిక తీరింది కానీ కాజల్ కి ఖైదీ నెం.150 చిత్రం వల్ల ఒరిగిందేమి లేదు పాపం.

Similar News