చిన్మయి కోసం ప్రశ్నిస్తున్న భర్త రాహుల్ రవీంద్రన్

Update: 2017-03-09 18:00 GMT

కోలీవుడ్ సింగర్ సుచిత్ర కార్తిక్ గత కొద్దీ రోజులుగా హెడ్ లైన్స్ లో నిలుస్తున్న పేరు. సుచిత్ర వాడుతున్న ట్విట్టర్ అకౌంట్ లో తమిళ యువ సంగీత దర్శకుడు అనిరుద్-కథానాయిక ఆండ్రియాల ప్రైవేట్ ఫోటో, రానా దగ్గుబాటి-త్రిషల ప్రైవేట్ ఫొటోలతోపాటు పలువురు సినిమా సెలబ్రిటీస్ వ్యక్తిగత ఫోటోలను బహిర్గతం చేస్తూ ఈ ట్విట్టర్ అకౌంట్ చేసిన హంగామా అంతా ఇంతా కాదు. అయితే సుచిత్ర భర్త కార్తిక్ మాత్రం ఒక సారి తన భార్య మానసిక పరిస్థితి బాగాలేదని మరొక సారి సుచిత్ర ట్విట్టర్ అకౌంట్ హ్యాకింగ్ కి గురైంది అని చెప్తుండటంతో ఏది నమ్మాలో ఏది నమ్మకూడదో జనాలతోపాటు కోలీవుడ్ స్టార్స్ కి కూడా అంతు చిక్కని పరిస్థితి.

ఇక నమ్మటం నమ్మకపోవటం పక్కన పెడితే అనిరుద్-యాండ్రియా, రానా దగ్గుబాటి-త్రిష ల ఫొటోలకంటే అత్యంత ఇంటిమేట్ గా సింగర్ కం డబ్బింగ్ ఆర్టిస్ట్ చిన్మయి పలువురు కోలీవుడ్ స్టార్స్ తో వున్న ప్రైవేట్ ఫొటోస్ అండ్ వీడియోస్ ట్విట్టర్ లో అప్లోడ్ చేస్తానని ప్రకటించిన సుచిత్ర అకౌంట్ సంచలన ప్రకంపనలే సృష్టించింది. ఇప్పటి వరకు ఎటువంటి స్పందన తెలుపని చిన్మయి లోలోన కుమిలిపోతోందని తన భర్త యువ హీరో రాహుల్ రవీంద్రన్ చెప్పాడు. "సుచిత్ర అకౌంట్ లో ట్వీట్ చేసిన విధంగా నిజంగా అటువంటి వీడియోస్ అండ్ ఫొటోస్ వుంది ఉంటే ఇంత కాలం ఆగే అవసరం లేకుండా అప్పుడే బహిర్గత పరిచే వారు. అలాంటి తప్పు ఎప్పుడు చిన్మయి చెయ్యలేదు కాబట్టే మేము దీనిపై స్పందించకూడదని ముందు అనుకున్నాం. కానీ ఇదే వ్యవహారం వైరల్ అవుతుండటంతో జనం ఇది నిజం అని నమ్మితే ఇంతకాలం కష్టపడి సంపాదించిన గుర్తింపు, పరువు మొత్తం పోతుందని చిన్మయి ఆవేదన చెందుతుంది. తన ఆవేదన చూడలేక నేనే ఇప్పుడు సుచిత్ర అకౌంట్ ఎవరు ఆపరేట్ చేస్తుంటే వారికి చెప్తున్నాను. మీ దగ్గర చిన్మయికి సంబంధించిన ఎటువంటి డేటా వున్న మీరు నిరభ్యంతరంగా బహిర్గత పరచుకోవచ్చు. కానీ ఇలా అప్పుడు చేస్తాం ఇప్పుడు చేస్తాం వెయిట్ అండ్ సి అంటూ అపోహల్ని, అబద్ధాలని బాల పరిచి ఆర్టిస్టుల కెరీర్ లు నాశనం చేయొద్దు." అంటూ ఆవేశ పూర్వకమైన విన్నపం తెలియజేశాడు రాహుల్ రవీంద్రన్.

Similar News