చాలా స్టైలిష్ గా ఉండబోతుండడట!!

Update: 2017-09-24 10:00 GMT

మహేష్ బాబు మొదటిసారి తన కెరీర్ లో మురుగదాస్ దర్శకత్వంలో నటించిన బైలింగ్వల్ చిత్రం 'స్పైడర్'. దర్శకుడు మురగదాస్ ఈ మూవీ ని అటు తమిళ్ లో ఇటు తెలుగు లో ఏక కాలంలో తెరకెక్కించాడు. 120 కోట్ల భారీ బడ్జెట్ తో రూపొందిన ఈ చిత్రం సెప్టెంబర్ 27 అంటే ఈ బుధవారమే ప్రేక్షకుల ముందుకురానుంది. ఎన్నాళ్ళ నుండో స్పైడర్ విడుదలపై మహేష్ అభిమానులు ఆశగా ఎదురుచూస్తున్నారు. మహేష్ ఈ చిత్రంలో ఒక స్పై ఏజెంట్ గా నటించడం తో ఈ చిత్రం పై భారీ అంచానాలు ఏర్పడ్డాయి. అయితే తాజాగా జరిగిన ఒక ఇంటర్వ్యూలో మహేష్ ఈ చిత్రం ఎలా ఉండబోతుందో చెప్పాడు.

రెండో తరహా చిత్రమే.....

మహేష్ స్పైడర్ చిత్రం గురించి మాట్లాడుతూ దర్శకుడు మురుగదాస్ సినిమాలు రెండు రకాలుగా ఉంటాయని.... మొదటి రకం సినిమాలు ఎమోషనల్ గా ఉండే 'రమణ, కత్తి' లాంటి సినిమాలైతే.... రెండో రకం సినిమాలు స్టైలిష్ గా ఉండే 'గజినీ, తుపాకి' సినిమాలు అని చెబుతున్నాడు. అయితే ఇప్పుడు తానూ హీరోగా మురుగదాస్ తెరకెక్కించిన 'స్పైడర్' చిత్రం మాత్రం రెండో తరహాకు చెందిన స్టైలిష్ సినిమా అని చెబుతున్నాడు. ఈ చిత్రంలో ప్రతి సన్నివేశం చాలా స్టైలిష్ గా ఉంటుందని..... ఇక మురుగదాస్ సినిమాల్లో ఉండే ఎమోషన్స్ ఈ సినిమాలో కూడా కావాల్సినంత ఉంటుందని చెబుతున్నాడు. ఈ చిత్రంలో మహేష్ బాబు సరసన రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా నటించగా.... ఎస్ జే సూర్య విలన్ పాత్ర పోషించాడు.

Similar News