చరణ్ రంగస్థలం లుక్ ఎప్పుడంటే.

Update: 2017-09-21 14:00 GMT

రామ్ చరణ్ - సమంత జంటగా తెరకెక్కతున్న రంగస్థలం చిత్రానికి సుకుమార్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ చిత్రం అప్పుడప్పుడు షూటింగ్ శరవేగంగా జరుపుకుంటున్నప్పటికీ మధ్యలో స్పీడ్ బ్రేకర్స్ వలే చాలా సమస్యలు షూటింగ్ కి అడ్డు పడుతున్నాయి. అసలు సినిమా మొదలు పెట్టి చాలా నెలలు గడుస్తున్నప్పటికీ ఇంతవరకు ఈ చిత్రంలోని లుక్స్ బయటికి రాలేదు. మధ్య మధ్యలో ఏవో లీక్డ్ పిక్స్ తప్పనిచ్చి. సినిమాని మాత్రం సంక్రాంతికి విడుదల చేస్తున్నట్లు రంగస్థలం నిర్మాతలు మొన్నామధ్యన ప్రకటించారు. అయితే రామ్ చరణ్ లుక్ కోసం మెగాభిమానులు అర్రులు చచ్చేలా ఎదురు చూస్తున్నారు.

అయితే రామ్ చరణ్ రంగస్థలం ఫస్ట్ లుక్ కి ఇప్పుడు ముహూర్తం సెట్ చేశారంటున్నారు. సినిమా మొదలైనప్పుడు రంగస్థలం సినిమాని దసరాకే విడుదల చేస్తారని అన్నారు కానీ... షూటింగ్ లేట్ వలన అది కాస్తా సంక్రాంతికి వెళ్లిపోయిన విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు ఈ దసరా కానుకగా చరణ్ రంగస్థలం ఫస్ట్ లుక్ వదులుతారట. ఇక సుకుమార్ స్టయిల్ ల్లోనే ఈ ఫస్ట్ లుక్ ఉండబోతుందంటూ ప్రచారం జరుగుతుంది. అయితే రంగస్థలం ఫస్ట్ లుక్ ని పవర్ స్టార్ పవన్ చేస్తుల మీదుగా విడుదల చేయించే ఏర్పాట్లలో చిత్ర బృందం వున్నట్లుగా వార్తలొస్తున్నాయి.

మరి పవన్ కళ్యాణ్ ఈ రంగస్థలం ఫస్ట్ లుక్ ని విడుదల చేస్తాడా? అనే సందేహాలు ఉన్నప్పటికీ చరణ్, సుకుమార్ అడిగితె పవన్ కాదనడానే అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు మెగా ఫాన్స్. ఇకపోతే ఈ ఫస్ట్ లుక్ విడుదల అప్పుడైనా సినిమా విడుదల డేట్ కన్ఫర్మ్ చేస్తరో లేదో తెలియాల్సి ఉంది.

Similar News