గ్యాప్ ఉండదు కాబ్బట్టి ముందే ప్లాన్ చేసుకున్నారు

Update: 2018-03-25 12:11 GMT

పెళ్ళైతే చేసుకున్నారు కానీ క్షణం కూడా కాళీ లేదు సమంత - చైతన్యలకు. పెళ్లికి ముందే కొన్ని ప్రాజెక్ట్స్ విడివిడిగా కమిట్ అయ్యారు ఇద్దరు. క్షణం గ్యాప్ కూడా తీసుకోకుండా ఇద్దరు బిజీగా ఉండటంతో రెండు వారాల జాలీ ట్రిప్ కోసం ఇద్దరు అమెరికా వెళ్లినట్టు తాజా సమాచారం.

రంగస్థలం.. మహానటి సినిమాలను పూర్తి చేసుకుని కన్నడ రీమేక్ సినిమా యు టర్న్ సినిమాను కొంత భాగం చేసేసింది. మరోపక్క చైతు కూడా సవ్యసాచి సినిమాలో ఫుల్ బిజీగా ఉన్నాడు. ఈ సినిమా తర్వాత అసలు కాళీ లేకుండా రెండుమూడు సినిమాలు ఒప్పుకున్నాడు. మారుతీతో చేస్తున్న శైలజా రెడ్డి గారి అల్లుడు... వెంకటేష్ తో బాబీ దర్శకత్వంలో మల్టీ స్టారర్...అలానే చైతు - సామ్ జంటగా నిన్ను కోరి డైరెక్టర్ శివ నిర్వాణతో ఓ సినిమా చేయనున్నారు. గ్యాప్ రాదని ముందే ఊహించి ఇప్పుడు వెకేషన్ ప్లాన్ చేసుకున్నట్టు కనిపిస్తోంది.

అటు సమంత వెకేషన్ నుండి రాగానే యు టర్న్ సినిమా మిగిలిన పార్ట్ పూర్తి చేయాలి. విశాల్ తో నటించిన ఇరుంబు తిరై డబ్బింగ్ వెర్షన్ 'అభిమన్యుడు' ఫస్ట్ కాపీ సిద్ధంగా ఉంది. తమిళనాడు సమ్మె పూర్తి కాగానే విడుదలకు రెడీ అవుతుంది.ఇక చైతు - శివ నిర్వాణ సినిమాలో సామ్ ఒకే అయింది. ఇప్పుడు బాబీ - చైతు మూవీలో కూడా సామ్ నే తీసుకోవాలని చూస్తున్నారంట. ఈ ట్రిప్ పూర్తయ్యాక వీటికి సంబంధించి పూర్తి క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.

Similar News