గౌరవం ఉన్నప్పటికీ దక్షిణాది చిత్రాలలో నటించను

Update: 2017-03-04 10:56 GMT

బాలీవుడ్ టాప్ కథానాయిక కరీనా కపూర్ గత ఏడాది డిసెంబర్ 20 న ఒక మెగా బిడ్డకు జన్మనిచ్చి ఇప్పుడు తిరిగి సినిమాలలో నటించటానికి సిద్దమై పోయింది. వయసుకి సంబంధం లేకుండా టీనేజ్ భామలతో పోటీగా తన బాడీ స్ట్రక్చర్ ని మైంటైన్ చేస్తూ వివాహం అనంతరం కూడా స్టార్ హీరోస్ తోపాటు యువ కథానాయకులకు కూడా జోడిగా నటించి సక్సెస్ ఐయ్యింది కరీనా కపూర్. అయితే కరీనా కపూర్ ఫుల్ స్వింగ్ లో వున్నప్పుడు కూడా ఇతర భాషల నుంచి వచ్చిన అవకాశాలను సద్వినియోగ పరచుకోలేదు. కరీనా కపూర్ కి సమకాలీనులైన కథానాయికలు ఐశ్వర్య రాయ్, ప్రీతీ జింతా, కత్రినా కైఫ్ వంటి వారంతా దక్షిణాది చిత్రాలలో కూడా మెరవగా కరీనా మాత్రం బాలీవుడ్ కె పరిమితమైపోయింది.

ఇప్పటి వరకు ఇతర భాషలలో నటించకపోవటానికి గల కారణాలను ఎప్పుడూ పంచుకొని కరీనా తొలి సారి దక్షిణాది చిత్రాల జోలికి వెళ్లకపోవటానికి కారణం వెల్లడించింది. "ఇప్పటి వరకు నాకు అనేక సార్లు దక్షిణాదికి చెందిన పలు సినిమా పరిశ్రమల నుంచి క్రేజీ ప్రాజెక్ట్స్ లో యాక్ట్ చేసే అవకాశం, అధిక పారితోషికాల ప్యాకేజీ తో వచ్చాయి. కానీ నాకు దక్షిణాదికి చెందిన ఏ భాషలోనూ కనీస ప్రవేశం లేదు. అందువల్ల నాకు కచ్చితంగా భాష ఒక అడ్డంకిగా మారుతుంది. దక్షిణాది చిత్ర పరిశ్రమలపై అపారమైన గౌరవం వున్నా, తెలుగు, తమిళ, మళయాళ భాషలలో గొప్ప చిత్రాలు నిర్మితమవుతున్నప్పటికీ నేను బాలీవుడ్ ధాటి రాకపోవటానికి కారణం మాత్రం భాష సమస్యే. డబ్బింగ్ ఆర్టిస్టుల గొంతు అరువు తీసుకునే వెసులుబాటు ఉన్నప్పటికీ నటిగా పాత్ర పోషిస్తున్నప్పుడు కనీస మోతాదులోనైనా భాష తెలిసి ఉండాలనేది నా అభిప్రాయం." అని వివరించింది కరీనా కపూర్.

Similar News