గురు తరువాత వెంకీ ఎంచుకోబోయే పాత్ర ఇదేనా?

Update: 2017-03-30 07:59 GMT

తెలుగు చలన చిత్ర పరిశ్రమలో సీనియర్ హీరోస్ లో ఒకరైన విక్టరీ వెంకటేష్ ఫాల్స్ ప్రెస్టేజ్ కి పోకుండా పాత్రలను తన వయసుకి తగ్గవి ఎంచుకుంటూ కథానాయకుడిగా తన కెరీర్ని చాలా సెట్టిల్డ్ గా సాగిస్తున్నారు. రేపు(31 మార్చ్) విడుదల కాబోతున్న గురు చిత్రంలో మధ్య వయసు కోచ్ పాత్రలో కనిపించబోతున్న వెంకటేష్ ఈ పాత్ర కోసం తన సాల్ట్ అండ్ పెప్పర్ స్టైల్ నే మైంటైన్ చేశారు. గురు చిత్రం అనంతరం చేయబోయే చిత్రాల కోసం ఇప్పటికే పూరి జగన్నాథ్, జాగర్లమూడి రాధ కృష్ణ(క్రిష్) వంటి పలువురు ప్రముఖ దర్శకుల కథలు చర్చల్లో ఉండగా వెంకటేష్ మనసు మాత్రం 1940 లో వచ్చిన ఓ తెలుగు చిత్రం పై పడిందట.

1924 లో మొక్కపాటి నరసింహ శాస్త్రి గారు రచించిన కామిక్ నవల బారిష్టరు పార్వతీశం అప్పట్లో బాగా ప్రసిద్ధి చెందింది. 1940 లో ఇదే నవల ఆధారంగా తెలుగులో చలన చిత్రంగా నిర్మించగా ఈ చిత్రం అప్పట్లో ఆర్ధిక లాభాలను చూడలేకపోయింది. కానీ లంక సత్యం పోషించిన బారిష్టరు పార్వతీశం పాత్రకు మాత్రం ఎనలేని గుర్తింపు లభించింది. అదే నవలని ఉన్నత పాఠశాల విద్యార్ధులకి తెలుగు పాఠ్యపుస్తకాలలో పాఠం గా కూడా చేర్చటం జరిగింది. విదేశాలకు వెళ్లి బారిష్టరు విద్య అభ్యసించాలనుకునే ఒక అమాయక చక్రవర్తి పడవ ప్రయాణం దగ్గర నుంచి ఇంగ్లాండ్ దేశంలో ఎదుర్కొన్న పరిస్థితులను కళ్ళకు కట్టినట్టు చెప్పే ఈ చిత్రాన్ని వెంకటేష్ నేటి తరం ప్రేక్షకులకు చేరువ చేసేలా స్క్రీన్ ప్లే లో తగిన మార్పులు చేపించి ఆ పాత్ర తాను పోషించటానికి ఆసక్తి చూపుతున్నారట.

Similar News