గాలి పెళ్లిలో రకుల్ డ్యాన్స్ అదిరిందిట!

Update: 2016-11-16 13:27 GMT

గాలి జనార్దన్ రెడ్డి కూతురు బ్రహ్మణి పెళ్లి అంగరంగ వైభవం గా బెంగుళూరు ప్యాలెస్ లో అతిరధ మహారధులు, వి.వి.విఐపిల మధ్య చాలా రిచ్ గా జరిగిందని సమాచారం. ఇక ఈ పెళ్లిలో గాలి చాలా విశేషాలే చూపించారని అంటున్నారు. ఏకంగా ఈ వివాహానికి 650 కోట్లు ఖర్చు పెట్టారనేది మరో ప్రచారం. ఈ విషయంపై ప్రతిపక్షాలు ఈ రోజు రాజ్యసభలో దుమ్మెత్తిపోశాయి. అయినా ఒక అవినీతి నేత ఇంట పెళ్ళికి బిజెపి నేతలు హాజరవ్వడం పట్ల ఇప్పుడు రాజకీయంగా పెద్ద దుమారమే చెలరేగింది.

అదలా ఒక పక్క రచ్చ జరుగుతుంటే ఇటు గాలి మాత్రం కూతురి పెళ్ళిలో అనేక రకాల చిత్ర విచిత్రాలు అతిథులకు, ఆత్మీయులకు చూపించాడని అంటున్నారు. ఇక ఈ పెళ్ళిలో సినిమా తారలతో కూడా డాన్స్ చేపిస్తున్నాడని ఎప్పటినుండో చెబుతున్నారు. బాలీవుడ్ స్టార్స్ తో పెరఫామెన్స్ చేయిస్తున్నాడని చెప్పారు. ఇక అటు బాలీవుడ్ తారలేమో గాని ఇటు టాలీవుడ్ తారలు, టాలీవుడ్ సింగర్స్ తో మాత్రం మాంచి ప్రోగ్రామ్స్ పెట్టించాడని కొన్ని వీడియోస్ సోషల్ మీడియాలో లీక్ అయ్యాయి. ఆ వీడియోస్ ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ హల్ చల్ చేస్తున్నాయి.

ఆ వీడియో లో టాలీవుడ్ టాప్ స్టార్ రకుల్ ప్రీత్ సింగ్ డాన్స్ అదరగొట్టినట్లు తెలుస్తోంది. అంతేకాకుండా రకుల్ డాన్స్ బీభత్సంగా చేసేసిందని ఆ వీడియో చూసిన వాళ్ళు కామెంట్స్ పడేస్తున్నారు. మరి ఆ స్థాయిలో పెళ్ళికి వచ్చిన వాళ్ళని గాలి సంతోషపెట్టేసాడు. ఇక ఈ పెళ్లి మాత్రం సినిమా సెట్టింగ్స్ ని తలతన్నేలా చేసాడని ఆ వాతావరణాన్ని చూసిన వాళ్ళు అంటున్న మాట.

Similar News