'గరుడ వేగా' ఫస్ట్ వీక్ వరల్డ్ వైడ్ షేర్స్

Update: 2017-11-11 14:00 GMT

'గరుడ వేగా' ప్రస్తుతం ఈ సినిమా టాలీవుడ్ లో హాట్ టాపిక్ అయింది. మొదటి రోజు నుండే ఈ సినిమాకు హిట్ టాక్ వచ్చింది. రాజశేఖర్ అండ్ టీం ప్రస్తుతం సక్సెస్ ప్రొమోషన్స్ లో వున్నారు. ముఖ్యంగా హీరో రాజశేఖర్ మాత్రం చాలా ఆనందంగా వున్నాడు. ఎందుకంటే చాలా రోజులు హిట్ అనే పదానికి దూరంగా వున్నా రాజశేఖర్ ఈ సినిమాతో చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాడు.

సినిమా హిట్ అయితే అయింది కానీ.. బాక్స్ ఆఫీస్ వద్ద సత్తా చాటులేకపోతుంది. మొదటి రోజు నుండే ఈ చిత్రం తక్కువ కలెక్షన్స్ తో నెట్టుకొస్తోంది. ఫస్ట్ వీక్ వరల్డ్ వైడ్ రూ.5.18 కోట్లు రాబట్టింది. అయితే ఈ చిత్రం రూ.25 కోట్లు బడ్జెట్ తో తెరకేక్కిన్చారు. మరి ఇప్పటి వరకు కేవలం రూ.5.18 కోట్లు మాత్రమే వసూల్ చేసింది. మహా అయితే ఈ చిత్రం కోటి లేదా రెండు కోట్లు కలెక్ట్ చేయగలుతుంది. ఓవరాల్ గా 7 కోట్లు కలెక్ట్ చేసిద్ది అనుకుందాం.. అయినా ఈ లెక్కన 18 కోట్లు నష్టం తప్పదు. అయితే ఈ సినిమాకి ఇంకా రీమేక్, శాటిలైట్ రేట్స్ మాత్రం భారీ ఆఫర్స్ వస్తున్నాయి అని టాక్. మరి అదే కనుక నిజం అయితే ఈ సినిమా సేఫ్ జోన్ లో చేరే ఛాన్స్ వుంది. 'గరుడ వేగా' ఫస్ట్ వీక్ వరల్డ్ వైడ్ కలెక్షన్స్ మీ కోసం..

ఏరియా షేర్స్( కోట్లు )

నైజాం 1.60

వైజాగ్ 0.52

సీడెడ్ 0.51

గుంటూరు 0.35

కృష్ణ 0.31

ఈస్ట్ గోదావరి 0.31

వెస్ట్ గోదావరి 0.18

నెల్లూరు 0.12

ఏపీ + తెలంగాణ 3.90

ఓవర్సీస్ 0.90

కర్ణాటక + రెస్ట్ అఫ్ ఇండియా 0.38

టోటల్ వరల్డ్ వైడ్ 5.18

Similar News