ఖాన్స్ క్రేజ్ కి బ్రేక్ వేసే హీరో ఈయనేనా?

Update: 2018-03-27 05:25 GMT

బాలీవుడ్ లో ఖాన్స్ త్రయం అంటే షారుఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్, అమీర్ ఖాన్స్ కి విపరీతమైన డిమాండ్ వుంది. వారినుండి సినిమా వస్తుంది అంటే చాలు ఆ సినిమాకి విపరీతమైన క్రేజ్ రావడమే కాదు గత కొన్నాళ్లుగా వీరి సినిమాలు కోట్లు కొల్లగొట్టి ఇతర బాలీవుడ్ హీరోలకు చుక్కలు చూపిస్తూ ఎదురులేని శక్తులుగా ఎదిగారు. అజయ్ దేవగన్, అక్షయ్ కుమార్ లు ఒక రేంజ్ ఉన్నా కూడా ఖాన్స్ త్రయం ముందు అది దిగడుపే అన్నట్లుగా వుంది బాలీవుడ్ యవ్వారం. అయితే ఇప్పుడు బాలీవుడ్ ఖాన్స్ త్రయానికి ముచ్చెమటలు పట్టిస్తున్నాడు ఒక యంగ్ హీరో.

అతనెవరంటే సంజయ్ లీల బన్సాలి దర్శకత్వంలో వచ్చిన పద్మవత్ సినిమాలోని అల్లావుద్దీన్ ఖిల్జీ పాత్ర పోషించిన రణ్వీర్ సింగ్. రణ్వీర్ సింగ్ కి అభిమానుల్లో విపరీతమైన ఫాలోయింగ్ ఉంది. అతని ఎనర్జీ మరే బాలీవుడ్ హీరోలోను కనబడదు. పద్మవత్ చిత్రం లో నెగెటివ్ షేడ్స్ వున్న అల్లావుద్దీన్ ఖిల్జీ పాత్రలో రణ్వీర్ నటనకు అందరూ నీరాజనాలు పట్టారు. అంతలాంటి హీరో ఏ అవార్డు ఫంక్షన్ లో అయినా లేదా మరే ఈవెంట్ లో అయినా చాలా హుషారుగా 1000 రేట్ల ఎనర్జీ లెవల్స్ తో రెచ్చిపోయి కనబడతాడు. అయితే ఇప్పుడు రణ్వీర్ సింగ్ యవ్వారం బాలీవుడ్ ఖాన్స్ త్రయం భయపడేటట్లుగా వుంది

అదేమిటంటే క్రికెట్ లో ఇప్పుడు ఐపిల్ కి ఎలాంటి స్థానముందో తెలిసిందే. బిసిసిఐ కి ఐపిల్ ద్వారా బోలెడంత సంపాదన వస్తుంది. అందుకే బిసిసిఐ ఐపీఎల్ విషయంలో అన్ని చాలా గ్రాండ్ గా ప్లాన్ చేస్తుంది. ప్రస్తుతం ఐపిల్ సీజన్ 11 ఏప్రిల్ 7 నుండి మొదలు కాబోతుంది. అయితే ఐపిల్ సీజన్ 11 ని గ్రాండ్ గా నిర్వహించడమే కాదు... ఆ సీజన్ ఓపెనింగ్ సెర్మోని కూడా గ్రాండ్ గా ప్లాన్ చేసింది. అయితే ఆ సెర్మనీ కోసం బాలీవుడ్ యంగ్ అండ్ ఎనర్జిటిక్ హీరో రణ్వీర్ స్టేజ్ మీద డాన్స్ వెయ్యడానికి గాను అతనికి బిసిసిఐ అక్షరాలా 5 కోట్ల రూపాయల ఆఫర్ ఇచ్చిందట. కేవలం 15 మినిట్స్ ఐపీఎల్ ఓపెనింగ్ సెర్మోని లో రణ్వీర్ చేసే పెరఫార్మెన్స్ కోసం ఇలా 5 కోట్ల రూపాయల ఆఫర్ ఇచ్చారట. మరి నిమిషానికి రణ్వీర్ ఈ లెక్కన 33 లక్షల 33 వేల 333 రూపాయల 33 పైసలు అందుకుంటున్నాడు.

మరి రణ్వీర్ సింగ్ ఇలా 5 కోట్ల ఆఫర్ అందుకున్నాడనేది నిజమో కాదో అనేది అధికారికంగా బయటికి రాలేదు గాని.. ప్రస్తుతం బాలీవుడ్ సర్కిల్స్ లో వినబడుతున్నమాట మాత్రం ఇదే. అయితే బిసిసిఐ ని రణ్వీర్ ఐదు కోట్లు డిమాండ్ చేసినా యూత్ లో అతనికున్న క్రేజ్ తో మారుమాట్లాడకుండా అతను అడిగింది ఇవ్వడానికి ఒప్పుకుందట. మరి ఇదంతా చూస్తుంటే రణ్వీర్ సింగ్ ఖాన్స్ త్రయానికి బ్రేక్ వేసేలా కనబడడం లేదూ..!

Similar News