క్వారంటైన్ టైం లో ఆ హీరోతో కలిసుంటా?

ప్రస్తుతం కరోనా లాక్ డౌన్ లో హీరోయిన్స్ అంతా ఏవేవో చేస్తూ సోషల్ మీడియాలో బిజీగా గడుపుతున్నారు. వర్కౌట్స్, వంటలు, తల్లితండ్రులతో కాలం గడపడం ఇలా ఎవరికీ [more]

Update: 2020-05-17 06:50 GMT

ప్రస్తుతం కరోనా లాక్ డౌన్ లో హీరోయిన్స్ అంతా ఏవేవో చేస్తూ సోషల్ మీడియాలో బిజీగా గడుపుతున్నారు. వర్కౌట్స్, వంటలు, తల్లితండ్రులతో కాలం గడపడం ఇలా ఎవరికీ నచ్చినట్టుగా వారు ఉంటున్నారు. అయితే హీరోయిన్స్ చాలామంది సోషల్ మీడియాలో అభిమానులతో ఇంటరాక్ట్ అవుతున్నారు  అయితే హీరోయిన్ పూజ హెగ్డే ని మీరు క్వారంటైన్ టైం లో ఉన్నప్పుడు మీకిష్టమైన ఏ హీరోతో మీరు క్వారంటైన్ షేర్ చేసుకుంటారు అని అడగగా.. దానికి పూజా ఇది చాలా కష్టమైనా ప్రశ్నే. ఒకరని కాదు కానీ.. అందరు హీరోలతోనూ అనిపిస్తుంది. మహేష్, ప్రభాస్, ఎన్టీఆర్, వరుణ్ తేజ్, అల్లు అర్జున్, అక్షయ్ కుమార్, హృతిక్ రోషన్ లలో ఎవరికీ వారే అనేక అంశాల్లో ప్రతిభావంతులు. అందుకే నాకు ఇలా క్వారంటైన్ అవకాశం వస్తే… అందరి దగ్గరనుండి ఎదో ఒక విద్య నేర్చుకోవాలని ఉంది అంటుంది.

అదే ఒకే ఒక్క హీరోని ఎంచుకోవాలని చెబితే బాలీవుడ్ హీరో హృతిక్ రోషన్ ని ఎంచుకుంటా అని.. స్వీయ నిర్బంధంలో హ్రితిక్ రోషన్ తో కలిసుంటా అని.. హృతిక్ రోషన్ చిన్నప్పటినుండి నా కలల హీరో అని.. నా అదృష్టం కొలది బాలీవుడ్ లో నా ఫస్ట్ సినిమాని హృతిక్ రోషన్ తోనే కలిసి నటించా అని, హృతిక్ అనేక విషయాల్లో నాకు స్ఫూర్తిగా నిలుస్తుంటారు. స్వీయ నిర్బంధంలో రోజు లేచిన తర్వాత హృతిక్ అందాన్ని చూస్తూ గడిపేస్తా అని.. వర్కౌట్స్ చెయ్యడం, అటు ఆహారపు అలవాట్లలో, ఇటు డాన్స్ ల విషయాల్లో హృతిక్ నుండి ఎంతో నేర్చుకుంటా అని చెబుతుంది.

Tags:    

Similar News