క్రేజ్ కోసమే ఆమెను తీసుకుంటున్నారా?

Update: 2018-02-24 09:00 GMT

ప్రభాస్ - సుజిత్ కలయికలో తెరకెక్కుతున్న సాహో చిత్రాన్ని... యువి క్రియేషన్స్ వారు భారీ బడ్జెట్ తో హాలీవుడ్ స్టాండర్డ్స్ తో తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రం త్వరలోనే దుబాయ్ పరిసర ప్రాంతాల్లో మేజర్ యాక్షన్ సన్నివేశాలను తెరక్కేకించడానికి పయనం కానుంది. పలు భాషల్లో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి ఎంత క్రేజ్ తీసుకురావాలో అంత క్రేజ్ తీసుకొచ్చేందుకు.. ఇప్పటికే బాలీవుడ్ హీరోయిన్ శ్రద్ద కపూర్ ని తీసుకోవడమే కాదు.... సాహో విలన్స్ అందరిని బాలీవుడ్ నుంచే దింపారు. ఇంటర్నేషనల్ క్రేజ్ కోసమే ఎక్కువగా ఈ చిత్రానికి బాలీవుడ్ నటులను వాడుతున్నారనే టాక్ ఉంది.

అమీ జాక్సన్ ను తీసుకోవాలని....

అయితే ఇప్పుడు సాహో కి మరింత క్రేజ్ పెంచేందుకు సాహో యూనిట్ సరికొత్త ప్లాన్ చేసినట్టుగా ఒక న్యూస్ బయటికి వచ్చింది. అదేమిటంటే... రోబో బ్యూటీ, లండన్ బ్యూటీ అయిన అమీ జాక్సన్ ని సాహో లోకి తీసుకుంటున్నారనే న్యూస్ నిన్న శుక్రవారం నుండి సోషల్ ఇండియాలో చక్కర్లు కొడుతోంది. బాలీవుడ్ హీరోయిన్ తో బి టౌన్ అంతటిని తమవైపు తిప్పుకున్న సాహో యూనిట్ ఇప్పుడు రోబో 2 .ఓ బ్యూటీ ని కూడా ఈ సినిమా కోసం సౌత్ లో సాహో సినిమాకి మరింత క్రేజ్ వస్తుందని భావిస్తున్నారట. మరి సాహో కన్నా ముందే రజినీకాంత్ - అమీ జాక్సన్ జంటగా నటించిన 2 .ఓ విడుదలవుతుంది.

తమకు ప్లస్ అవుతుందని....

అలాగే అమీ జాక్సన్ ఆ సినిమాతో అటు తెలుగు, ఇటు తమిళంలోనూ క్రేజ్ సంపాదిస్తుంది. అలాంటి అమీ జాక్సన్ ని సాహో కోసం తీసుకుంటే.. 2 .ఓ సినిమాతో అమీ జాక్సన్ కు వచ్చే క్రేజ్ తమ సినిమాకి ప్లస్ అవుతుందని దర్శక నిర్మాతలు భావిస్తున్నారట. అందుకే సాహో దర్శకుడు సుజీత్, అమీ ని కలిసి మాట్లాడినట్టుగా తెలుస్తోంది. అయితే ఈ ఛాన్స్ పట్ల అమీ జాక్సన్ సుముఖతను వ్యక్తం చేసినా .. ఇంకా గ్రీన్ సిగ్నల్ మాత్రం ఇవ్వలేదని తెలుస్తుంది. ఒకవేళ అమీ ఓకే అంటే .. సాహో లో స్పెషల్ సాంగ్ లో పెడతారా? లేదంటే మరేదైనా కీ రోల్ ఇస్తారా? అనేది తెలియాల్సి ఉంది.

Similar News