క్రేజీ ప్రాజెక్ట్ లో అనుష్క కూడానా?

Update: 2017-08-28 15:00 GMT

'బాహుబలి' తర్వాత అనుష్కకి ఇప్పటివరకు ఒక్క ఛాన్స్ కూడా రాలేదు. బాహుబలి సెట్స్ మీదున్నప్పుడే... 'భాగమతి' సినిమాలో నటించడం స్టార్ట్ చేసిన అనుష్క ఆ సినిమా షూటింగ్ కంప్లీట్ చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా వుంది. కేవలం పోస్ట్ ప్రొడక్షన్ వలన, విజువల్ ఎఫెక్ట్స్ వలెనే సినిమా విడుదలకు ఆలస్యం అవుతుందనే టాక్ వుంది. అయితే అనుష్క లీడ్ రోల్ చేస్తున్న 'భాగమతి' చిత్రం ఈ ఏడాది చివర్లో గాని వచ్చే ఏడాది గాని విడుదలయ్యే సూచనలున్నాయి. ఇక అనుష్క కి ఈ 'భాగమతి' తప్ప తన చేతిలో ప్రస్తుతానికి మరే ప్రాజెక్ట్ లేదు.

అయితే ఇప్పుడు అనుష్క, చిరు 151 మూవీ 'సై రా' లో ఒక కీ రోల్ చేయబోతున్నట్టు వార్తలొస్తున్నాయి. ఇప్పటికే మహామహులు నటిస్తున్న ఈ 'సై రా నరసింహారెడ్డి' చిత్రంలో ఇప్పుడు అనుష్క కూడా భాగం కాబోతుందంటున్నారు. 'సై రా' లో ఒక కీలక పాత్రకి చిత్ర యూనిట్ అనుష్కని సంప్రదించగా... ఆ రోల్ నచ్చి అనుష్క దాన్ని ఓకె చేసినట్లుగా చెబుతున్నారు. నిజంగానే అనుష్క కూడా ఈ 'సై రా'లో నటిస్తే ఈ సినిమాకి మంచి క్రేజ్ ఆటోమాటిక్ గా వచ్చేస్తుంది ఎందుకంటే 'బాహుబలి'తో జాతీయ స్థాయిలో దేవసేనగా అనుష్క కి గొప్ప పేరొచ్చింది.

మరి 'బాహుబలి' తర్వాత భారీ బడ్జెట్ గా భారీ మల్టీస్టారర్ చిత్రంగా తెరకెక్కబోతున్న ఈ 'సై రా'లో ఇప్పటికే చిరంజీవి, అమితాబచ్చన్, విజయ్ సేతుపతి, జగపతి బాబు, నయనతారలు నటిస్తున్నారు. ఇక ఇప్పుడు అనుష్క కూడా ఓకె అయితే గనక ఆ లిస్ట్ లోకి అనుష్క కూడా చేరినట్టే. ఇక 'సై రా' చిత్రాన్ని సురేందర్ రెడ్డి తెరకెక్కిస్తుండగా.. రామ్ చరణ్ నిర్మిస్తున్నాడు.

Similar News