క్రిస్టమస్ కి అమల ఇచ్చిన కొసమెరుపు కానుక 

Update: 2016-12-26 23:00 GMT

సినిమాల్లో నటించే విషయమై తన భర్తతో ఏర్పడ్డ విభేదాలు విడాకులకు దారి తీయగా, విడాకులకు సిద్ధపడ్డ నాటినుంచే బ్లాక్ బ్యూటీ అమల పాల్ వరుసగా సినిమా లకు ఒప్పంద పత్రాలపై సంతకాలు చేసేసింది. రానున్న రెండు సంవత్సరాలలో పట్టాలెక్కబోతున్న సూపర్ స్టార్ రజని కాంత్ కబాలి 2 తో కలిపి ఇప్పటి వరకు తమిళ, మలయాళ భాషల్లో తన సెకండ్ ఇన్నింగ్స్ ఆరంభానికి ఏడు చిత్రాలు సైన్ చేసింది అమల. వీటిల్లో ప్రస్తుతం చిత్రీకరణ దశలో వున్న మూడు తమిళం, రెండు మలయాళ చిత్రాలు 2017 సంవత్సరంలో విడుదల కానున్నాయి. ఇక సినిమాల వార్తలను దాటుకుని అమల పాల్ లేటెస్ట్ గా క్రిస్టమస్ సందర్భముగా దిగిన ఫోటో షూట్ తో అందరి దృష్టిని ఆకట్టుకుంది.

చెన్నై టైమ్స్ మ్యాగజైన్ వారు క్రిస్టమస్ పండుగ సందర్భముగా అమల పాల్ తో వారి మ్యాగజిన్ కోసం ఒక ఫోటో షూట్ చేశారు. ఆ ఫోటో లలో ఒక వైపు క్రిస్టమస్ హౌస్ తోపాటు గిఫ్ట్ ప్యాక్ చేసి వున్న వివిధ బహుమతులు, వెనుక వైపు అలంకరించబడిన ఆకర్షణీయమైన కాంతులు విరజిమ్మే లైటింగ్స్ అన్నీ వున్నా కూడా చెన్నై టైమ్స్ మ్యాగజిన్ వారు చెప్పాలి అనుకున్న క్రిస్టమస్ శుభాకాంక్షలు వీక్షకులకు చేరలేదు. ఇందుకు కారణం ఈ అలంకారాన్ని బ్లాక్ బ్యూటీ తన కాస్ట్యూమ్, సిట్టింగ్ స్టైల్ తో బబ్లీగా కనపడుతూ తన కాళ్ళ సొగసుతో చూపరుల దృష్టిని పూర్తిగా తన వైపు తిప్పేసుకుంది. చెన్నై టైమ్స్ మ్యాగజిన్ తో పాటు ఈ ఫోటో షూట్ ఇప్పుడు సోషల్ మీడియాలో కూడా బాగా పాపులర్ అయిపోతుంది.

Similar News