కోరిక ఓకె… కానీ అవకాశం ఇవ్వాలి కదా?

కెరీర్ లో చెప్పుకోవడానికి RX 100 తప్ప మరో సినిమా లేని పాయల్ రాజ్ ఫుట్ ఇప్పుడు ఐటమ్ అవతారమెత్తింది.. ఐటెం గీతాల్లో నటించబోతుంది అంటూ ప్రచారం [more]

Update: 2020-07-09 10:03 GMT

కెరీర్ లో చెప్పుకోవడానికి RX 100 తప్ప మరో సినిమా లేని పాయల్ రాజ్ ఫుట్ ఇప్పుడు ఐటమ్ అవతారమెత్తింది.. ఐటెం గీతాల్లో నటించబోతుంది అంటూ ప్రచారం జరగడంతో.. తొందరగానే మేలుకొన్న పాయల్ రాజపుట్.. తానేమి ఐటెం సాంగ్స్ చెయ్యడం లేదని.. తనకి అలంటి అవకాశాలు రాలేదని క్లారిటీ ఇచ్చింది. లాక్ డౌన్ సమయంలో పెంచిన ఒళ్ళు కరిగించుకోవడానికి ఓ పూట భోజనం మానేయ్యమని చెప్పిన పాయల్ వర్కౌట్స్ స్థానంలో ఇంట్లోని ఎవరి పనులు వారు చేసుకుంటే కెలెరీస్ తగ్గించుకోవచ్చని చెప్పింది. అయితే తాజాగా పాయల్ కోరిక వింటే సహజంగా బాగానే ఉంది కానీ.. ఆమె కోరిక నెరవేరాలిగా అనిపిస్తుంది.

అదేమిటంటే పాయల్ రాజపుట్ కి సందీప్ వంగ తో పనిచెయ్యాలని ఉందట. సందీప్ వంగ అంటే బోల్డ్ డైరెక్టర్. అర్జున్ రెడ్డితోనే అదరగొట్టిన సందీప్ వంగ కబీర్ సింగ్ తోనూ బాలీవుడ్ లో జెండా పాతాడు. తదుపరి చిత్రాన్ని మొదలెడమనుకునేలోపు కరోనా లాక్ డౌన్ అడ్డంపడింది. అలంటి క్రేజీ డైరెక్టర్ తో వర్క్ చెయ్యాలని ఉందట పాయల్ రాజపుట్ కి. మరి పాయల్ కోరిక ఓకె కానీ.. సందీప్ వంగ ఇప్పుడు బాలీవుడ్ హీరో తో అయినా లేదంటే విజయ్ దేవరకొండ తో అయినా సినిమా చెయ్యాలనే ప్లాన్ లో ఉన్నదంటున్నారు. మరి పాయల్ కోరిక విన్న సందీప్ వంగ ఏమైనా అవకాశం ఇస్తాడేమో చూడాలి.

Tags:    

Similar News