కొత్తగా ట్రై చేస్తున్నారుగా?

Update: 2017-11-18 08:00 GMT

సందీప్ కిషన్ , మెహ్రీన్ జంటగా నటించిన చిత్రం ‘కేరాఫ్ సూర్య’. ఈ చిత్రం తమిళంలో ‘నెంజిల్ తునివిరుందాల్’ పేరుతో విడుదలైంది. తమిళ దర్శకుడు సుశీంద్రన్ ఈ చిత్రాన్ని ఏక కాలంలో రెండు భాషల్లో తెరకెక్కించాడు. నవంబర్ 10న విడుదలైన ఈ చిత్రం ఫలితం ఆ చిత్ర బృందాన్ని కాస్త నిరాశపరిచింది. చిత్ర నిడివి ఆ ఫలితానికి ఒక కారణం అని భావించిన చిత్ర బృందం ఇటీవలే కథానాయిక పాత్రకు సంబంధించి కొన్ని సన్నివేశాలను తొలగించి చిత్ర నిడివిని తగ్గించింది. ఆ ఆలోచనా బెడిసికొట్టింది. ఆ చిత్ర ఫలితాన్ని ఆ నిడివి ఏ మాత్రం మార్చలేకపోయింది.

తిరిగి విడుదల...

దాంతో ఆ చిత్ర దర్శకుడు సుశీంద్రన్ వినూత్నంగా ఆలోచించి ఆ చిత్రాన్ని ప్రదర్శించే అని థియేటర్లలో నుండి ఆ చిత్రాన్ని తొలగిస్తున్నామని.. కొన్ని మార్పులు చేర్పులు చేసి ఈ చిత్రాన్ని తిరిగి డిసెంబర్ 15న విడుదల చేయనున్నామని ప్రకటించాడు. ప్రస్తుతం ఈ చిత్రం ప్రదర్శితమవుతున్న అన్ని థియేటర్లలో ఈ విధానాన్ని అమలు చేస్తున్నట్లు తెలిపారు సుశీంద్రన్. విడుదలైన ఒక చిత్రంలో చిన్న పాటి మార్పులు చేయడం సహజమే.. కానీ ఏకంగా సినిమానే ఆపేసి తిరిగి విడుదల చేయడం అనేది కాస్త ఆశ్చర్యపరిచే విషయమే.

Similar News