కొత్త స్టూడియోకు చరణ్ ఏర్పాట్లు.!

Update: 2017-02-10 07:30 GMT

మెగాస్టార్ తనయుడుగా అనతి కాలంలోనే మెగా ఇమేజ్ ను సొంతం చేసుకున్నాడు రామ్ చరణ్ తేజ. అంతటితో ఆగకుండా నిర్మాతగా కూడా రంగ ప్రవేశం చేసి తొలి సినిమాతోనే మహోన్నతమైన రుచులు చూశాడు చరణ్. రామ్ చరణ్ నిర్మాతగా ఖైదీ నంబర్ 150 ఇచ్చిన జోష్ మెగా పవర్ స్టార్ నూతనోత్సాహాన్ని నింపుతుంది. అదే జోష్ తో ప్రస్తుతం రామ్ చరణ్ హీరోగానే కాకుండా నిర్మాతగా కాకుండా మాంచి చురుకుగా పని చేస్తున్న చరణ్ తాజాగా మరో కొత్త ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తుంది. నిర్మాతగా మంచి కిక్ మీదున్న రామ్ చరణ్ హైదరాబాద్ లో ఓ ఫిలిం స్టూడియోని కట్టేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తుంది.

అయితే ఇప్పుడు హైదరాబాద్ లో స్టూడియోలకు అస్సలు కొదవలేదు. దండిగానే ఉన్నాయి. అందుకనే చరణ్ ఓ మినీ స్టూడియోని నిర్మించేందుకు ప్లాన్ చేస్తున్నట్లుగా తెలుస్తుంది. అందుకోసమే నగర శివార్లలో ఈ మధ్య రామ్ చరణ్ కొన్ని ప్లేస్ లను కూడా పరిశీలించినట్లు టాక్ నడుస్తుంది. కాగా అన్నీ అనుకున్నట్లుగా జరిగితే త్వరలోనే హైదరాబాద్ లో మరో ఫిలిం స్టూడియో నిర్మాణం కూడా జరగవచ్చని పరిశ్రమ వర్గాల టాక్ నడుస్తుంది. దీనికి సంబంధించి త్వరలోనే అధికారిక ప్రకటణ కూడా రావచ్చని తెలుస్తుంది. ఇంతటితో ఆగకుండా రామ్ చరణ్, మహేష్ బాబుతో కలిసి హోటల్ బిజినెస్ రంగంలో కూడా ప్రవేశించాలని భావిస్తున్నట్లు తెలుస్తుంది.

Similar News