కొత్త పుంతలు తొక్కుతున్న అన్నపూర్ణ-సురేష్

Update: 2018-01-16 09:00 GMT

సురేష్ ప్రొడక్షన్స్ స్థాపించటంతోనే అత్యంత నిర్మాణ విలువలతో చలన చిత్రాలని నిర్మించి తమ సంస్థని ప్రధమ స్థానంలో నిలబెట్టిన ప్రముఖ నిర్మాత మూవీ మొఘల్ దగ్గుబాటి రామానాయుడు మూడవ తరం వారసుడు ఒకరు. తన నటనతో క్లాస్ ప్రేక్షకులని మైమరిపింపచేసి రొమాంటిక్ హీరోగా వారి మనస్సులో చిరకాలం నిలిచిపోయిన నటసామ్రాట్ అక్కినేని నాగేశ్వరరావు స్థాపించిన అన్నపూర్ణ స్టూడియోస్ వ్యవహార బాధ్యతలు చేపడుతున్న అక్కినేని మూడవ తరం వారసురాలు మరొక వైపు. వీరిరువురు కలిసి మారుతున్న ప్రేక్షకుల అభిరుచికి తగిన విధంగా వారి సొంత నిర్మాణ సంస్థలకి ఉన్న లెగసీ కంటిన్యూ చేసే దిశగా అడుగులు ప్రారంభించారు.

అన్నపూర్ణ స్టూడియోస్-సురేష్ ప్రొడక్షన్స్ కలిసి కొన్ని టెలివిషన్ షోస్, వెబ్ సిరీస్, వాణిజ్య ప్రకటనలు ప్లాన్ చేస్తున్నాయి. వీటి నిర్మాణ వ్యవహారాల్ని అన్నపూర్ణ స్టూడియోస్ సంస్థ తరపున యార్లగడ్డ సుప్రియ, సురేష్ ప్రొడక్షన్స్ తరపున రానా దగ్గుబాటి పర్యవేక్షించనున్నారు. ఇప్పటికే వెండితెరతో పాటు బుల్లి తెరపై కూడా తన మార్క్ చూపించిన రానా దగ్గుబాటి ఇప్పుడు బుల్లి తెర పై కూడా తమ సొంత సంస్థ సురేష్ ప్రొడక్షన్స్ తో పాటు మరో అగ్ర నిర్మాణ సంస్థ అన్నపూర్ణ స్టూడియోస్ ల నైతిక విలువలు పెంపొందించే కార్యక్రమాలతో ప్రేక్షకులని ఆకట్టుకోనున్నారు.

Similar News