కొత్త కాంబినేషన్ పట్టాలెక్కేనా!!

Update: 2017-09-28 16:00 GMT

హీరో నాని ప్రస్తుతం టాలీవుడ్ లో వరుస హిట్స్ తో దూసుకుపోతున్నాడు. ఈ ఏడాది మొదట్లోనే నేను లోకల్, అలాగే ఈ ఏడాది మధ్యలో నిన్ను కోరి సినిమాల తో హిట్స్ ని అందుకున్న నాని ప్రస్తుతం ఇంకో రెండు సినిమాల షూటింగ్ లో బిజీ బిజీ గా ఉన్నాడు. అందులో ఒకటి వేణు శ్రీరామ్ దర్శకత్వం లో వస్తున్న ఎంసీఏ. అలాగే మరొకటి మేర్లపాక గాంధీ దర్శకత్వం లో వస్తున్న కృష్ణార్జున యుద్ధం. వీటితో పాటే నాని మరొక సినిమాకు సిద్ధమవుతున్నాడనే టాక్ వినబడుతుంది.. అది కూడా స్టార్ డైరెక్టర్ విక్రమ్ కుమార్ దర్శకత్వంలో కావడం విశేషం.

చర్చల దశలోనే....

ప్రస్తుతం నాని - విక్రమ్ సినిమా చర్చల దశలో ఉందని.... త్వరలోనే ఈ ప్రాజెక్ట్ ఫైనలవుతుందనే వార్తలు వినబడుతున్నాయి. అయితే ఈ వార్త ఎంతవరకు నిజమవుతుందో అంటున్నారు కొందరు. ఒకవేళ ఈ వార్త నిజమైనప్పటికీ.... ఈ ప్రాజెక్ట్ పట్టాలెక్కాలంటే కాస్త ఎక్కువ సమయమే పడుతుంది. ఎందుకంటే నాని నటిస్తున్న రెండు సినిమాలు పూర్తి కావాల్సి ఉంది. అలాగే ప్రస్తుతం విక్రమ్ కే కుమార్ అఖిల్ తో హలో సినిమా చేస్తూ బిజీగా ఉన్నాడు కాబట్టి. మరి నాని - విక్రమ్ కుమార్ కలయికలో సినిమా అనగానే అందరిలో విపరీతమైన ఆసక్తి ఏర్పడిపోయింది. ఎప్పుడూ కొత్తగా ఆలోచించే విక్రమ్ కుమార్, అలాగే ఎప్పుడూ కొత్త కథలతో హిట్స్ కొడుతున్న నాని కలిసి సినిమా చేస్తున్నారు అంటేనే సినిమాపై ఆసక్తే కాదు... అంచనాలు భారీగానే ఉంటాయి.

Similar News