కొడుక్కి బెస్ట్ విషెస్ అందించాడు

Update: 2017-08-31 13:00 GMT

సినిమా సెలబ్రిటీస్ కి కుటుంబంతో గడిపే సమయం కోసం ఎదురు చూస్తుంటారు. ఎందుకంటే సినిమా షూటింగ్స్ తో ఎక్కువగా అవుట్ డోర్స్ లోనే గడుపుతూ ఎక్కువ రోజులు కుటుంబానికి దూరంగా ఉండడంతో... షూటింగ్ లలో దొరికిన ఖాళీ సమయాన్ని మాత్రం కుటుంబానికే ఇచ్చేస్తుంటారు. అలా టాలీవుడ్ లో ఫ్యామిలీకి ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇస్తూ కనిపించేవారు.... మహేష్ బాబు, అల్లు అర్జున్, రామ్ చరణ్, ఎన్టీఆర్ లాంటి వాళ్ళు ఉన్నారు. అందరిలో ఎక్కువగా మహేష్ తన ఫ్యామిలీ విషయంలో చాలా కేర్ తీసుకుంటాడు. మహేష్ సినిమాలలో షూటింగ్ షూటింగ్ కి మధ్యన బ్రేక్ వస్తే చాలు భార్య నమ్రత, పిల్లలు గౌతమ్, కూతురు సితారాలతో కలిసి విదేశాలకు ఎగిరిపోతాడు. అలాగే అక్కడ జరిగే విషయాలతోపాటు అక్కడ అందమైన ప్రదేశాల్లో దిగే ఫోటోలను మహేష్ వైఫ్ నమ్రత ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో షేర్ చేస్తుంటుంది.

మరి తన కుటుంబాన్ని ఎక్కువగా లైక్ చేసే మహేష్ ఇప్పుడు తన కొడుకు గౌతమ్ పుట్టినరోజున గౌతమ్ కి ట్విట్టర్ ద్వారా పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపాడు. మహేష్ తన కొడుక్కి 'నా అస్తిత్వానికి కార‌ణం వాడు.. న‌న్ను న‌డిపించేది వాడు.. నా కుమారుడు.. నా ప్ర‌పంచం.. నా ఆనందం.. పుట్టిన‌రోజు శుభాకాంక్ష‌లు, గౌత‌మ్‌.. ఆనందంగా ఉండు' అంటూ కొడుకుకి విషెస్ తెలియజేశాడు మహేష్. మహేష్ గౌతమ్ కి ఇలా సోషల్ మీడియాలో పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పడం అనేది మహేష్ ఫాన్స్ ని విపరీతంగా ఆకట్టుకుంటుంది. '

ఇక మహేష్ తాజా చిత్రం 'స్పైడర్' విడుదలకు సిద్ధమవుతుండగా... కొరటాల డైరెక్షన్ లో 'భరత్ అనే నేను' చిత్రం షూటింగ్ లో జాయిన్ అవడమే కాదు తన నెక్స్ట్ ప్రాజెక్ట్ వంశీ పైడిపల్లి డైరెక్షన్ లో కూడా పూజ కార్యక్రమాలతో ఆఫీషియల్ గా మొదలెట్టేసాడు.

Similar News