కొడుకుతో కలిసి పొలంలో ట్రాక్టర్ నడుపుతున్న హీరోయిన్

Update: 2017-01-19 05:22 GMT

బ్లాక్ అండ్ వైట్ సినిమాల కాలంలో అనేక చిత్రాలలో కథానాయికగా నటించి స్టార్ హీరోయిన్ ఐన నాటి తరం కథానాయిక విజయ నిర్మల నటనతో పాటు 40 కి పైగా చలన చిత్రాలకు దర్శకత్వం కూడా వహించారు. గత ఏడాది సూపర్ స్టార్ కృష్ణ గారు నటించిన శ్రీశ్రీ చిత్రంలో ఆయన సరసన నటించటం తప్పితే ఇతర చిత్రాలలో విజయ నిర్మల ఈ మధ్య కాలంలో నటించలేదు. విజయ నిర్మల కుమారుడు నరేష్ తన నట జీవితంలో సెకండ్ ఇన్నింగ్స్ ని బాగా ఎంజాయ్ చేస్తున్నారు. వరుసగా పెద్ద దర్శక నిర్మాతల చిత్రాలలో నటిస్తూ క్యారెక్టర్ ఆర్టిస్టుగా బిజీ అయిపోయి తన సమకాలీన కథానాయకుడు, ప్రస్తుతం క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటిస్తున్న నట కిరీటి రాజేంద్ర ప్రసాద్ కి కాంపిటేషన్ గా నిలుస్తున్నారు.

క్యారెక్టర్ ఆర్టిస్టుగా వరుసగా చిన్న, పెద్ద తేడా లేకుండా సినిమాలలో నటిస్తున్న నరేష్ తీరిక సమయాల్లో సేంద్రీయ వ్యవసాయం చేస్తున్నారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వంటి సినీ ప్రముఖులతో సహా పలువురు ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ సేంద్రీయ వ్యవసాయాన్ని ప్రోత్సాహిస్తున్నారు. సినిమాల నుంచి విరామ జీవితం గడుపుతున్న విజయ నిర్మల తన తనయుడు నరేష్ కి తీరిక కుదిరినప్పుడల్లా నరేష్ తో కలిసి పొలంలో వ్యవసాయ పనులలో పాల్గొంటున్నారు. ఈ స్టార్ తల్లి కొడుకులు పొలంలో ట్రాక్టర్ నడుపుతున్న ఫోటో ఒకటి ఇప్పుడు సోషల్ మీడియా లో హల్చల్ చేస్తుంది. షాద్ నగర్ పరిసర ప్రాంతాలలో వారికి వున్న వ్యవసాయ భూములలో నూతన శైలి వ్యవసాయం చేపట్టటానికి నిరంతరం పరిశీలన జరుపుతుంటాం అని చెప్తున్నారు సీనియర్ నటుడు నరేష్.

Similar News