కొడుకు సినిమా సెట్ లో తండ్రి సినిమా షూటింగ్!

Update: 2018-04-17 06:28 GMT

రామ్ చరణ్ తాజా చిత్రం రంగస్థలం సినిమా రంగస్థలం అనే ఊరి పేరు మీద చిత్రీకరించబడింది. దర్శకుడు సుకుమార్ రంగస్థలంలోని పల్లె వాతావరణం, ప్రేమలు, పగలు, రాజకీయాల మీద సినిమాని తెరకెక్కించి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టారు. అయితే రంగస్థలం అనే ఊరి కోసం మొదట్లో రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో షూటింగ్ జరిపిన చిత్ర బృందానికి అక్కడ పబ్లిక్ వలన కలిగిన అసౌకర్యంతో హైదరాబాద్ లోనే జూబ్లీహిల్స్ వంటి కాస్ట్లీ ప్రాంతంలో రంగస్థలం ఊరు సెట్ వేయించాడు సుకుమార్. దాదాపుగా 12 కోట్లతో 25 ఎకరాల్లో నిర్మితమైన రంగస్థలం సెట్ సినిమాలో అందరిని ఆకర్షించింది. ఇక సినిమా విడుదలయ్యాక మీడియా వారు రంగస్థలం ఊరు సెట్ లో అనేక ఇంటర్వ్యూ లు కూడా చేసింది

ఆ ఆతర్వాత రంగస్థలం సెట్ ని చాలామంది సందర్శించారు. అయితే ఇప్పుడు రామ్ చరణ్ రంగస్థలం సెట్ ని తాను తెరకెక్కించబోయే సై రా సినిమా షూటింగ్ కోసం ఉపయోగించుకుంటున్నాడట. చిరు హీరోగా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతున్న సై రా నరసింహారెడ్డి సినిమా షూటింగ్ ప్రస్తుతం సెకండ్ షెడ్యూల్ ని జరుపుకుంటుంది. అయితే కొన్ని రోజులుగా హైదరాబాద్ అల్యూమినియం ఫ్యాక్టరీలోని ప్రత్యేకమైన సెట్లో సై రా సినిమా లోని కొన్ని కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. అయితే ఆ తరువాత షెడ్యూల్ రంగస్థలం విలేజ్ సెట్లో వుండనున్నట్టుగా సమాచారం అందుతుంది. రంగస్థలం ఊరు సెట్ లోనే అదనంగా మరో భారీ సెట్ ను సై రా కోసం వేయనున్నారట. ఈ భారీ సెట్ తో పాటు రంగస్థలం ఊరు సెట్ ను ఉపయోగించుకోనున్నట్టు చెబుతున్నారు.

ఉయ్యాలవాడ నరసంహారెడ్డి జీవిత కథ ఆధారంగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో ఉయ్యాలవాడ నరసింహా రెడ్డికి .. గ్రామీణ ప్రజలకు మధ్యన ఉన్న కొన్ని సన్నివేశాలను ఇక్కడ చిత్రీకరించనున్నారట. మరి అద్భుతమైన రంగస్థలం సెట్ లో కేవలం సై రా సినిమా షూటింగ్ మాత్రమే కాదు మరికొన్ని సినిమాల షూటింగ్ కూడా జరుగుతాయంటున్నారు. ఎందుకంటే మంచి విలేజ్ సెట్ మాత్రమే కాకుండా.. కొన్ని సినిమాల కోసం ప్రత్యేకంగా వేసిన కొన్ని సెట్స్ కొందరిని బాగా ఆకట్టుకుంటాయి. అందుకే ఆ సెట్ లో ఒక సినిమా చేసినా.. మరో విధంగా కొందరు తమ సినిమాల కోసం అలా ఆ సెట్స్ ని ఉపయోగించుకుంటుంటారు.

Similar News