కొడుకు కెరీర్ కోసం తలొగ్గిన తండ్రి

Update: 2018-01-18 12:46 GMT

కొడుకుని స్టార్ హీరోగా నిలబెట్టడంలో నాగ్ మరోసారి విఫలమయ్యాడు. మొదటి సినిమా వీవి వినాయక్ డైరెక్ట్ చేసిన అఖిల్ సినిమా ప్లాప్ అయింది. రెండో సినిమా హలోకి మంచి టాక్ వచ్చినా ప్లాప్ అయింది. ఇగోలకి పోయి రిలీజ్ టైమింగ్ సరిగా ప్లాన్ చేయకపోవడంతో హలోకి నెగటివ్ అయింది.

హలో సినిమా రిలీజ్ అయిన తర్వాత అఖిల్ తో నెక్స్ట్ సినిమా డీటెయిల్స్ అనౌన్స్ చేయిద్దాం అనుకున్నాడు నాగ్. కానీ ఆ ఆలోచన ఇప్పుడు మానుకున్నట్టు తెలుస్తుంది. అఖిల్‌తో ఒక ప్రయోగాత్మక చిత్రం చేయడం కంటే అనుభవజ్ఞుడైన దర్శకుడితో కమర్షియల్‌ చిత్రం చేయడం మంచిదని నాగార్జున ఫిక్సయ్యాడట. అందుకే రెగ్యులర్ గా పలువురు డైరెక్టర్స్ తో టచ్ లో ఉంటున్నాడు నాగ్.

అఖిల్ మొదటి సినిమా నుండి డైరెక్టర్స్ క్రియేటివిటీ విషయంలో నాగ్ ఇన్వాల్వ్ అవుతున్నాడని టాక్ ఉంది. ఇప్పుడు ఈ విషయం నాగ్ దాకా వెళ్లిందట. అందుకే ఇక దర్శకులకే ఫుల్‌ ఫ్రీడమ్‌ ఇచ్చేసి తన కెరియర్‌ని ఎంత జాగ్రత్తగా మలచుకున్నాడో అలాగే అఖిల్‌ కెరీర్ ని కూడా డైరెక్టర్ల చేతుల్లో పెట్టేయడానికి రెడీ అయ్యాడట.

Similar News