కేవలం హిట్ కొట్టాడనే కాదు..?

Update: 2017-11-17 10:00 GMT

భారీ బడ్జెట్ తో తెరకెక్కిన 'లై' సినిమాతో దారుణమైన ఫలితం చవిచూసిన హీరో నితిన్ మళ్ళీ ఇంకో భారీ చిత్రంలో నటించటానికి రెడీ అవుతున్నారు తెలుస్తుంది. గరుడ వేగా లాంటి మంచి చిత్రం తెలుగు ప్రేక్షకులకి అందించిన ప్రవీణ్ సత్తారు తో హీరో నితిన్ ఒక సినిమా చేయబోతున్నాడు.

ప్రవీణ్ సత్తారుతో....

అయితే నితిన్ స్వయంగా నేను ప్రవీణ్ సత్తారు తో సినిమా చేయబోతున్నాని అని ట్వీట్ చేసాడు. ప్రవీణ్ సత్తారుతో ఓ భారీ సినిమా చేస్తే ఎలా వుంటుందీ అని నితిన్ ఆలోచిస్తున్నట్టు తెలుస్తోంది. కానీ ప్రవీణ్ సత్తారు సుధీర్ బాబు పుల్లెల గోపీచంద్ బయోపిక్ తీయబోతున్నాడు. అలాగే హీరో నితిన్ కూడా కృష్ణ చైతన్య డైరెక్షన్ లో ప్రస్తుతం ఓ సినిమాలో నటిస్తున్నాడు. తర్వాత నిర్మాత రాధామోహన్ కు ఓ సినిమా చేయాల్సి వుంది. బహుశా ఆ తరువాత ప్రవీణ్ సత్తారు సినిమా వుంటుందేమో?

గరుడవేగ పుణ్యమేనా?

ప్రవీణ్ సత్తారుకు అంతటి అవకాశం ఇవ్వడానికి వెనుక కేవలం గరుడవేగ విజయం మాత్రమే కారణం కాదంటా..ప్రవీణ్ సత్తారు సోదరుడు నితిన్ మాంచి దోస్త్ లంట. ఆ కారణంగానే ప్రవీణ్ తో సినిమా చేయటానికి రెడీ అయ్యాడు అని సోషల్ మీడియా ప్రచారం జరుగుతుంది

Similar News