కృష్ణవంశీతో ఆయన కాంబినేషన్ అంతేమరి!

Update: 2016-10-24 05:41 GMT

అంతఃపురం, సముద్రం, ఖడ్గం, చక్రం, గోవిందుడు అందరి వాడేలే ఈ చిత్రాల పేర్లు వినగానే గుర్తొచ్చే రెండు పేర్లు కృష్ణ వంశి, ప్రకాష్ రాజ్. ఒకరు ఏ నటుల నుంచి ఐన పూర్తి స్థాయి ప్రతిభను బైటకి తీసి ప్రదర్షింపచేసే దర్శకుడు కాగా, మరొకరు పాత్ర కు, దర్శకుడి అభిరుచి కి బానిసగా మారిపోయి పోషించిన పాత్రకు జీవం పొయ్యగల నటుడు. ఆలా ఈ ఇద్దరి కలయికలో మళ్లీ అంతటి ప్రభావం చూపగలిగే స్థాయి కనిపిస్తున్న చిత్రం నక్షత్రం. నక్షత్రం చిత్రంలోని ప్రకాష్ రాజ్ కు సంబంధించిన ఫస్ట్ లుక్ విడుదల చేసారు.

సందీప్ కిషన్, సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్, కంచె ఫేమ్ ప్రగ్య జైస్వాల్ లు పోలీస్ ఆఫీసర్స్ గా నటిస్తున్న ఈ చిత్రంలో ప్రకాష్ రాజ్ కూడా ఖాకీ దుస్తులలోనే కనిపిస్తున్నాడు ఫస్ట్ లుక్ లో. అందరూ తారలు కనిపించబోయే ఈ నక్షత్రం కోసం కృష్ణ వంశి తీవ్రంగానే శ్రమిస్తున్నాడు. ఇటీవలి కాలంలో తన ముద్ర చాటుకునే సినిమా ఆయన నుంచి ప్రేక్షకులకు అందకపోవటంతో, ఈ చిత్రం పై తన దృష్టిని, కష్టాన్ని కేంద్రీకరించాడు. ప్రకాష్ రాజ్ కూడా విజయ దశమి కి మన ఊరి రామాయణం అనే గొప్ప చిత్రం తో ప్రేక్షకులని పలకరించే ప్రయత్నం చేసినా మన వాళ్ళు పట్టించుకోలేదు. అందుకే ఆయనకు కూడా నక్షత్రం చిత్రం కీలకం కానుంది.

నక్షత్రం చిత్రంలో అందరి పాత్రలు కీలకం కావటంతో పది ఫస్ట్ లుక్ లను ప్లాన్ చేసి ఒక్కొక నటులది ఒక్కో లుక్ ఒక్కొక్కటిగా విడుదల చేస్తున్నారు.

Similar News