కుర్రాడికి యాటిట్యూడ్ ఎక్కువైంది!!

Update: 2017-09-24 09:00 GMT

పెళ్లి చూపులు, అర్జున్ రెడ్డి సినిమాల హిట్స్ తో విజయ్ దేవరకొండ ఫెట్ పూర్తిగా మారిపోయింది. ఒక స్టార్ కి అందాల్సిన గౌరవాలు, హోదా అన్ని అందుతున్నాయి. విజయ్ తర్వాత చిత్రాలపై భారీ అంచనాలు ఏర్పడుతున్నాయి. ఇక అర్జున్ రెడ్డి ఇచ్చిన కిక్ మామూలుది కాదు. కేవలం నాలుగు కోట్లతో తెరకెక్కిన ఈ సినిమా 40 కోట్లు కలెక్ట్ చేసి విజయ్ దేవరకొండకి అదిరిపోయే విజయాన్ని అందించింది. ఇక అర్జున్ రెడ్డితో ఎక్కిన కిక్ నుండి బయపడలేకపోతున్నాడు విజయ్. అర్జున్ రెడ్డి విడుదలకు ముందునుండే విజయ్ యాటిట్యూడ్ ఎక్కువైందని కామెంట్స్ ఉన్నాయి. ఇక అర్జున్ రెడ్డి విజయం తర్వాత అది మరికాస్త ఎక్కువైంది అంటున్నారు.

ఎందుకుండదు... ?

అర్జున్ రెడ్డి విజయ గర్వంతో విజయ్ దేవరకొండ పెద్ద స్టార్ లా బిహేవ్ చేస్తున్నదంటున్నారు. ఇప్పటికే పలు కంపెనీలు విజయ్ దేవరకొండని తమ కంపెనీలకు బ్రాండ్ అంబాసిడర్ గా పెట్టుకోవడానికి తహతహ లాడుతున్నాయి. తాజాగా కె. ఎల్. ఎమ్ వస్త్ర దుకాణానికి బ్రాండ్ అంబాసిడర్ గా మారిన విజయ్ కె. ఎల్ ఎమ్ వస్త్ర దుకాణాల వివిధ బ్రాంచీలను ఓపెనింగ్ చేస్తూ హడావుడి చేస్తున్నాడు. ఇక షాప్ ఓపెనింగ్ కి వచ్చినప్పుడల్లా మంచి స్టైలిష్ లుక్ లో కనబడుతూ ఆకట్టుకుంటున్నాడు. స్టైలిష్ పంచె కట్టు లో సూపర్ గా కనబడుతున్నాడు. ఇప్పటికే అర్జున్ రెడ్డి ఫెమ్ తో ఫొటోస్ షూట్స్ గట్రా చేస్తున్న విజయ్ ఇప్పుడు అమ్మాయిలతో కూడా చిట్ చాట్ చేస్తూ అదరగొడుతున్నాడు.

ఓవర్ యాక్షన్ అంటూ కామెంట్లు....

ఇక నిన్న శనివారం కూకట్ పల్లి కె. ఎల్. ఎమ్ షోరూం ఓపెనింగ్ కి వచ్చిన విజయ్ దేవరకొండ అదే షో రూమ్ కి వచ్చిన మరో హీరోయిన్ కేథరిన్ ని ఆలింగనం చేసుకుని రకరకాల ఫోటోలకు ఫోజులిచ్చేశాడు. మరి అలా ఒక పబ్లిక్ ఈవెంట్ లో విజయ్ ఓవర్ యాక్షన్ చెయ్యడం ఏమిటంటూ కొందరు కామెంట్ చేస్తున్నారు. మరి ఇలా నెగెటివ్ గా కామెంట్ చేసేవారికి విజయ్ తనదయిన స్టయిల్లో సమాధానం చెబుతాడో... ఎందుకులే అని సైలెంట్ అవుతాడో... చూద్దాం.

Similar News