కింగ్ చేసిన ట్వీట్ లోని అంతరార్ధం ఏమిటో?

Update: 2017-03-07 10:38 GMT

కింగ్ అక్కినేని నాగార్జున తన తనయులు కథానాయకులుగా నిలదొక్కుకుంటున్న కాలంలో కూడా కథానాయకుడిగా నటిస్తూ మెప్పిస్తున్నాడు. హీరో గా ఆయన చేసే చిత్రాలతోపాటు నిర్మాతగా, అన్నపూర్ణ స్టూడియోస్ అధినేతగా ఆయన నిత్యం సినిమా యాక్టివిటీస్ లో మునిగిపోయి ఉంటుంటారు. ప్రస్తుతం ఆయన రాజు గారి గది 2 చిత్రంలో యాక్ట్ చేస్తూ, మరో వైపు యువ హీరో రాజ్ తరుణ్ నటిస్తున్న ఒక చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రంతో రంజిత అనే లేడీ డైరెక్టర్ ని ఇండస్ట్రీ కి పరిచయం చేస్తున్నారు నాగ్. నాగార్జున కెరీర్ ప్రారంభం ఐన నాటి నుంచి నేటి వరకు సినిమా లతో ఆయనకీ గ్యాప్ వచ్చిందని ప్రేక్షకులైతే భావించరు. కానీ నాగ్ అలా భావిస్తున్నట్టు తన తాజా ట్వీట్ పేర్కొంటోంది.

👍Back in business with Raju gari gadhi 2/#RGG2

బ్యాక్ ఇన్ బిజినెస్ విత్ రాజు గారి గది 2 అంటూ నాగ్ చేసిన ట్వీట్ అందరిని ఆలోచజనాల్లో పడేస్తోంది. గత ఆరేడు సంవత్సరాల వెనక్కి వెళ్లి చూస్తే నాగార్జున కెరీర్ ఆశించిన స్థాయిలో లేదు. ఇప్పుడే నాగ్ అభిరుచికి తగ్గ కథలకి ప్రేక్షకుల నుంచి కూడా మంచి స్పందన దక్కుతుంది. మనం, సోగ్గాడే చిన్ని నాయనా, ఊపిరి వంటి చిత్రాల ఫుల్ ఫ్లెడ్జ్డ్ కమర్షియల్ మీటర్ లో లేకపోయినప్పటికీ విజయం సాధించటానికి ఇదే ప్రధానమైన కారణం. అయితే గత నెలలో నాగార్జున బాగా నమ్మకం పెట్టుకున్న ఓం నమో వెంకటేశాయ చిత్ర ఫలితం మాత్రం ఆయనని నిరాశ పరిచింది. అయితే ఒక్క పరాజయానికి నాగ్ ఇంత బలమైన స్టేట్మెంట్స్ ఇస్తాడా? ఓం నమో వెంకటేశాయ ఫలితం నాగ్ పై అంతటి ప్రభావం చూపిందా అంటే సమాధానం ఆయనకే తెలియాలి.

రాజు గారి గది తో హారర్ కామెడీ జోనర్ లో అద్భుతమైన విజయం అందుకున్న దర్శకుడు ఓంకార్, ఈ సీక్వెల్ తో కూడా నాగ్ కి అనూహ్యమైన విజయాన్ని ఇస్తాడని ఆశిద్దాం.

Similar News