కాటమరాయుడు నైజామ్ విడుదల హక్కులని దక్కించుకున్న అభిమాని

Update: 2017-02-13 03:32 GMT

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన గత చిత్రం సర్దార్ గబ్బర్ సింగ్ ఘోర పరాజయం చవి చూసినప్పటికీ ఆ చిత్రం ఫుల్ రన్ లో 52 కోట్ల రూపాయల షేర్ వసూళ్లు చేసి డిసాస్టెర్స్ లో చరిత్ర సృష్టించింది. అలానే పవర్ స్టార్ నటిస్తున్న ప్రస్తుత చిత్రం కాటమరాయుడు టీజర్ కి ఇప్పటికి 7 మిలియన్ వ్యూస్ తో సంచలనం సృష్టిస్తోంది. ఈ టీజర్ క్రీస్తే చేసిన హైప్ తో కాటమరాయుడు ప్రీ రిలీజ్ బిజినెస్ ఒక్క సారిగా ఊపందుకుంది. ఇప్పటికే అన్ని ప్రాంతాల నుంచి విడుదల హక్కులకు ఫాన్సీ రేట్స్ తో డీల్స్ వస్తుండగా నైజామ్ ప్రాంతానికి సంబంధించిన రిలీజ్ రైట్స్ కి గట్టి పోటీ ఏర్పడినప్పటికీ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వీరాభిమాని ఐన యంగ్ హీరో నితిన్ కాటమరాయుడు చిత్రాన్ని నైజాం లో విడుదల చేయటానికి అధిక రేటు చెల్లించి హక్కులని చేజిక్కించుకున్నారు. ఈ విషయాన్ని స్వయంగా యువ హీరో నితిన్ తన ట్విట్టర్ ద్వారా ప్రకటించారు. ఈ ఏడాది సంక్రాంతి పండుగకి తమ సంస్థ ద్వారా నందమూరి బాల కృష్ణ నటించిన 100 వ చిత్రం గౌతమీ పుత్ర శాతకర్ణి ని నైజాం ప్రాంతంలో విడుదల చేసిన నితిన్ ఇప్పుడు పవర్ స్టార్ కాటమరాయుడు చిత్రాన్ని ఏషియన్ ఫిలిమ్స్ సంస్థ తో కలిసి తమ సంస్థ శ్రేష్ట్ మూవీస్ పంపిణి చేస్తునట్టు ప్రకటించాడు.

THRILLED to announce that Asian films n sreshth movies wil b distributing POWERSTAR'S KAATAMARAYUDU for Nizam area..

Similar News