కాటమరాయుడు తీసేసి పాత సినిమాలు ఆడిస్తున్నారు

Update: 2017-03-30 07:34 GMT

గత శుక్రవారం భారీ అంచనాల మధ్యన విడుదలైన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన ఎమోషనల్ మరియు యాక్షన్ ప్యాక్డ్ మూవీ కాటమరాయుడు తొలి రోజు వసూళ్లతో పవర్ స్టార్ బాక్స్ ఆఫీస్ స్టామినా రుజువు చేసింది. అయితే తొలి రోజు నుంచే మిక్స్డ్ టాక్ సొంతం చేసుకున్న కాటమరాయుడు రెండవ రోజు నుంచి చాలా కేంద్రాలలో 70 శాతం ఆక్యుపెన్సీ కి కూడా నోచుకోకపోవడం గమనార్హం. మల్టీప్లెక్స్ లలో మాత్రం తొలి మూడు రోజులు టికెట్స్ చిత్రం విడుదలకి ముందుగానే బుకింగ్స్ ఐపోవటంతో తొలి వీకెండ్ ముగిసే సరికి చెప్పుకోదగ్గ వసూళ్లతో కాటమరాయుడు బైట పడింది. కానీ సోమవారం నుంచి సినిమా పరిస్థితి పూర్తిగా తారుమారు అయిపోయింది.

కాటమరాయుడు విడుదలై వారం తిరగకముందే చాలా కేంద్రాలలో కాటమరాయుడు కి బదులు వేరే సినిమాల ప్రదర్శనలు మొదలయ్యాయి. తొలి వారం ముగిసే సరికి కొన్ని ఊర్లలో మెయిన్ థియేటర్లలో కూడా కాటమరాయుడు కి బదులుగా గురు లేక డోరా చిత్రాల ప్రదర్శనలకు ఎక్సిభిటర్లు చూస్తుండటం గమనార్హం. ఇప్పటికే కాటమరాయుడు ని రీప్లేస్ చేసిన థియేటర్స్ లో అయితే మరీ ఘోరంగా ఈ ఏడాది బాగా ఆడిన పాత చిత్రాలను సెకండ్ రిలీజ్ చేయటం జరిగింది. శతమానం భవతి, నేను లోకల్, ఖైదీ నెం.150 చిత్రాలు ప్రస్తుతం చాలా కేంద్రాలలో సెకండ్ రిలీజ్ లో ప్రదర్శితమవుతున్నాయి. ఇదే విధంగా కాటమరాయుడు రెండవ వారం కూడా కొనసాగితే పంపిణీదారులు వడ్డున పడటం అసాధ్యమే.

Similar News