కళ్యాణ్ చిత్రానికి క్లాప్ కొట్టిన మెగాస్టార్

Update: 2018-01-31 16:00 GMT

మెగా ఫామిలీ నుంచి ఇప్పటికే పది మంది దాకా హీరోలు ఉన్నప్పటికీ అందరి చిత్రాలు చూస్తూ చిరంజీవి కుటుంబ సభ్యులందరినీ ఆదరిస్తూ ఆయన అభిమానులు మెగా ఫామిలీ ని సక్సెస్ బాటనే నడిపిస్తున్నారు. ఇప్పుడు లేటెస్ట్ గా చిరంజీవి అల్లుడు కళ్యాణ్ దేవ్ హీరోగా పరిచయమవుతూ వారాహి చలన చిత్ర వారి నిర్మాణంలో సినిమా ప్రారంభం ఐయింది. చిరు ద్వితీయ కుమార్తె శ్రీజ భర్త అయిన కళ్యాణ్ దేవ్ కొంత కాలం పాటు నటనలో శిక్షణ పొంది సినిమా రంగంలోకి ప్రవేశించారు. చిరంజీవి క్లాప్ కొట్టి ఈ చిత్రాన్ని ప్రారంభించి తన అల్లుడికి ఆశీర్వాదం అందించారు.

తొలిషాట్ కు రాజమౌళి....

గతంలో జతకలిసే అనే చిన్న సినిమాను అందించిన రాకేష్ శశి ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తారు. మాళవిక నాయర్ ను హీరోయిన్ గా ఎంపిక చేసారు. తొలి షాట్ కు రాజమౌళి దర్శకత్వం వహించారు. ఎమ్ఎమ్ కీరవాణి కెమేరా స్విచాన్ చేసారు.అవసరాల శ్రీనివాస్, గుణ్ణం గంగరాజు, కళ్యాణ్ కోడూరు, ఎన్వీ ప్రసాద్ తదితరులు హాజరయ్యారు. ఈ ప్రాజెక్టుకు సెంధిల్ కుమార్ కెమేరా హ్యాండిల్ చేస్తారు. జ్యో అచ్యుతానంద, రంగస్థలం సినిమాకు పనిచేసిన రామకృష్ణ ఆర్ట్ డైరక్టర్ గా వ్యవహారిస్తారు.తనికెళ్ల భరణి, మురళీ శర్మ, నాజర్, సత్య రాజేష్ తదితరులు నటిస్తున్న ఈ సినిమాకు టైటిల్ ఇంకా ఫిక్స్ కాలేదు.

Similar News