కథ నచ్చటం వల్లనే కొత్త దర్శకుడితో చేస్తున్నా

Update: 2017-04-12 14:45 GMT

ఈ శుక్రవారం(14 ఏప్రిల్) మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ నటించిన నాలుగవ చిత్రం మిస్టర్ విడుదల కాబోతోంది. తన గత చిత్రానికి ఈ చిత్రానికి ఏడాదిన్నర వ్యవధి ఏర్పడటం పైగా తన గత చిత్రం లోఫర్ ఘోర పరాజయం చెందటంతో వరుణ్ మిస్టర్ తో ఎలాగైనా సక్సెస్ సాధించాలని ఆశపడుతున్నాడు. అయితే లోఫర్ కి మిస్టర్ కి మధ్యన వచ్చిన గ్యాప్ వరుణ్ కావాలని తీసుకున్నది కాదన్న సంగతి విదితమే. ఎకకలాంలో మిస్టర్, ఫిదా చిత్రాలకు కాల్ షీట్స్ సర్దుబాటు చేసుకుని శరవేగంగా రెండు చిత్రాలు పూర్తి చేస్తుండగా మిస్టర్ సెట్స్ లో ప్రమాదవ శాత్తు వరుణ్ తేజ్ కాలుకి గాయమై దాదాపు మూడు నెలల పాటు షూటింగ్స్ నుంచి బ్రేక్ తీసుకోవలసి వచ్చింది. కాగా గాయం నుంచి కోలుకున్న వెంటనే ముందుగా శ్రీను వైట్ల చిత్రానికి కాల్ షీట్స్ కేటాయించి మిస్టర్ చిత్రాన్ని పూర్తి చేసిన వరుణ్ ఇప్పుడు శేఖర్ కమ్ముల తెరకెక్కిస్తున్న ఫిదా పై దృష్టి సారిస్తున్నారు.

ఫిదా పూర్తి కాకముందే వరుణ్ తేజ్ నటించబోయే తదుపరి చిత్రం ఖరారైపోయింది. వరుణ్ కాలికి గాయమై బెడ్ రెస్ట్ తీసుకుంటున్న కాలంలో 20 కథలు విన్నాడట. వాటిల్లో వెంకీ అట్లూరి అనే ఫ్రెష్ ఫిలిం మేకర్ చెప్పిన కథ బాగా నచ్చటంతో వరుణ్ ఆ యువకుడికి తొలి చిత్ర అవకాశం కలిపించాడు. ఇప్పటి వరకు అడ్డాల శ్రీకాంత్, క్రిష్, పూరి, శ్రీనువైట్ల వంటి అనుభవజ్ఞులైన దర్శకుల చిత్రాలలో నటించిన వరుణ్ కథ నచ్చిన ఏకారణం చేతనే అనుభవం లేని యువకుడికి దర్శకత్వ అవకాశం ఇచ్చానంటున్నాడు. అలానే గీత ఆర్ట్స్ నిర్మాణంలో అనుకున్న చిత్రం కథ సెట్ కాక వాయిదా వేశామని త్వరలోనే ఆ సినిమా ఉంటుంది అని చెప్తూ మెగా ఫామిలీ హీరోలందరితో మల్టీ స్టారర్ సినిమాలలో నటించాలని ఉందని తన కోరికని వెలిబుచ్చాడు.

Similar News