కంటెంట్ ఉంటే... ఎలాగైనా గట్టెక్కేస్తాయి!!

Update: 2017-09-18 13:04 GMT

ఎన్టీఆర్ త్రిపాత్రాభినయం చేస్తున్న జై లవ కుశ చిత్రం ఈ గురువారం విడుదలకాబోతుంది. దసరా సీజన్ ని ఫుల్ గా క్యాష్ చేసుకోవాలని ఆరపడుతున్నారు జై లవ కుశ చిత్ర బృందం. ఇక జై లవ కుశ చిత్రంతో కోట్లు కొల్లగొట్టడానికి హీరో ఎన్టీఆర్ తో పాటు నిర్మాత కళ్యాణ్ రామ్ కూడా కాచుకుని కూర్చున్నారు. ఇకపోతే తెలంగాణ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో రోజుకి ఐదు ఆటలకు పర్మిషన్ ఇస్తూ ఉత్వరులు జారీ చేసింది. అయితే ఈ ఉత్తర్వులు జై లవ కుశ చిత్రానికి వర్తిస్తుందో ఇంకా టైం పడుతుందో అనే డైలమాలో ఉన్నారు ఎన్టీఆర్ అభిమానులు. ఎందుకంటే రోజుకి ఐదు ఆటలు అంటే బాక్సాఫీసు బొనాంజా గా జై లవ కుశ ఉండిపోతుందని వారి ఆశ.

కథ..ఉంటేనే....

ఇకపోతే జై లవ కుశ ప్రమోషన్స్ లో భాగంగా ఎన్టీఆర్ కి ఒక ప్రశ్న ఎదురైంది. అదేమిటంటే మీ సినిమాతో పాటే ఈ దసరాకి స్పైడర్, మహానుభావుడు చిత్రాలు విడుదలవుతున్నాయి. మరి ఆ సినిమాలు కూడా విజయం సాధిస్తాయనుకుంటున్నారా అని అడగగా.. దానికి ఎన్టీఆర్ ఎంతో తెలివిగా సినిమాల్లో కంటెంట్ అంటే... మంచి కథ ఉంటె అవి తప్పక విజయం సాధిస్తాయని చెప్పడమే కాదు... పండగల సీజన్ లో బోలెడన్ని సినిమాలు విడుదలవుతుంటాయి.. అయితే వాటిలో మంచి కథ బలం ఉంటేనే అవి బాక్సాఫీసు వద్ద నిలబడతాయని చెప్పాడు. అంతేకాదు సంక్రాంతికి విడుదలైన మూడు సినిమాలు విజయం సాధించడంపై కూడా ఎన్టీఆర్ అదిరిపోయే లాజిక్ చెప్పాడు.

శతమానం భవతి...

అదేమిటంటే సీనియర్ హీరో చిరంజీవి కమ్ బ్యాక్ మూవీ ఖైదీ నెంబర్ 150 అంటూ యాక్షన్ కామెడీతో హిట్ కొట్టగా.... బాలకృష్ణ గారు ఆయన 100 వ చిత్రాన్ని గౌతమీపుత్ర శాతకర్ణి వంటి చారిత్రాత్మక హిట్ కొట్టారు. అలాగే శర్వానంద్ ఒక మంచి కుటుంబ కథా చిత్రం శతమానంభవతి చిత్రంతో సూపర్ హిట్ కొట్టాడు. ఒకేసారి 100 సినిమాలు విడుదలైనా సరే.... అందులో కంటెంట్ ఉంటె మాత్రం తప్పక హిట్ అవుతాయని అంటున్నాడు ఎన్టీఆర్. మరి తానొక బలమైన కంటెంట్ ఉన్న జై లవ కుశ తో వస్తున్నట్టు చెప్పకనే చెప్పేసాడన్నమాట.

Similar News