ఒక్కేసారి రెండు కోట్లు పెంచేసిన లేడీ సూపర్ స్టార్

Update: 2018-03-26 05:32 GMT

తమిళంతో పాటు తెలుగులో కూడా నయనతార నటించిన 'కర్తవ్యం' హిట్ అయ్యిన సంగతి తెలిసిందే. తమిళంలోనే కాకుండా తెలుగులో కూడా ఆమెను లేడీ సూపర్ స్టార్ అంటూ అభిమానులు పొగిడేస్తోన్న, వరస సినిమాలతో దూసుకుపోతున్న ఈ లేడీ సూపర్ స్టార్ సినిమాకు 2 నుంచి రూ.3 కోట్ల వరకు రెమ్యున రేషన్ ను డిమాండ్ చేసింది.

కానీ ఇప్పుడు ఓ కొత్త సినిమా కోసం ఏకంగా రూ.5 కోట్ల వరకు పారితోషకం అందుకుందని ఓ తమిళ నిర్మాత వెల్లడించినట్లు తెలుస్తోంది. టాలీవుడ్ లో అనుష్క.. కోలీవుడ్ లో నయనతార లు అగ్ర హీరోయిన్లుగా కొనసాగుతున్నారు. తమిళంలో ఆమె క్రేజ్ మాములుగా లేదు. ఆ నిర్మాత ఆమెకు రూ.5 కోట్లు చెల్లించాడని వినికిడి. అంతే కాకుండా నయన్ సిబ్బంది ఖర్చులు.. తిండి ఖర్చులు.. ఇతర ఖర్చులు కలిపి 80 లక్షల నుండి 1 కోటి వరకు అవుతాయని వాటితో కలుపుకుంటే దాదాపు రూ. 6 కోట్లు చెల్లించినట్లేనని ఆ నిర్మాత చెప్పాడని తెలుస్తోంది.

నయన్ - అనుష్కలకు సౌత్ లోనే కాకుండా బాలీవుడ్ లో మంచి క్రేజ్ ఉంది హిందీలో కూడా వీరి సినిమాలు డబ్ అయ్యే అవకాశముంది.అందుకే నిర్మాతలు వారిద్దరికీ అంత రెమ్యున్ రేషన్ ఇచ్చేందుకు వెనుకాడడం లేదని టాక్.

Similar News