ఒక్క హిట్ తోనే మరీ అంత పెద్ద బాధ్యత ఇచ్చేస్తారా?

Update: 2017-09-17 02:34 GMT

ఒకప్పుడు తేజ దర్శకత్వంలో వచ్చిన సినిమాలు యూత్ ఫుల్ ఎంటర్టైనర్స్ గా ఉండి హిట్స్ కొట్టాయి. ప్రేమకథలను అందంగా తెరకెక్కించిన తేజ మధ్యలో ట్రాక్ తప్పి రకరకాల ప్రయోగాలు చేసి అనేక ప్లాప్ సినిమాలు తీసి ప్రేక్షకులకు చిరాకు తెప్పించాడు. అసలు టాలీవుడ్ హీరోలంతా తేజ అంటేనే భయపడే స్టేజ్ కి తేజ వచ్చేసిన టైం లోనే రానా హీరోగా 'నేనే రాజు నేనే మంత్రి 'సినిమా తీసి హిట్ కొట్టాడు. ఈ సినిమాని నిర్మించిన నిర్మాతలు గట్టివారు.. హీరో రానాకీ గట్టి బ్యాగ్రౌండ్ ఉండబట్టి యావరేజ్ కావాల్సిన 'నేనే రాజు నేనే మంత్రి' సినిమా చివరికి హిట్ గా నిలిచింది. తక్కువ బడ్జెట్ తో నిర్మితమైన ఈ చిత్రం దర్శక నిర్మాతలకు, హీరోకు తలా ఐదు కోట్ల లాభాన్ని తెచ్చిపెట్టింది.

మరి ఈ ఒక్క హిట్ తో తేజాకి ఇప్పుడు టాలీవుడ్, కోలీవుడ్ ఆఫర్స్ తన్నుకుంటూ వచ్చేస్తున్నాయి. ఇప్పటికే కోలీవుడ్ హీరో కార్తీ ఒక భారీ ఆఫర్ ఇచ్చినట్లుగా వార్తలొస్తున్నాయి. మరోపక్క మెగా మల్టీస్టారర్ చేయబోతున్నట్లుగా చెబుతున్నారు. ఇక ఇప్పుడు అన్నిటిలో హైయ్యెస్ట్ ఆఫర్ ఒకటి దర్శకుడు తేజ తలుపు తట్టినట్లుగా వార్తలొస్తున్నాయి. తెలుగు సినిమా పరిశ్రమలోనే ఎంతో ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్టును తేజ దర్శకత్వం చేసే అవకాశం వచ్చిందంటున్నారు. అదేమిటంటే నందమూరి ఎన్టీఆర్ బయో పిక్ ని నందమూరి బాలకృష్ణ తెరకెక్కిస్తానని ఎప్పుడో అధికారికంగా ప్రకటించాడు. అలాగే.... ఇప్పుడు 102 వ చిత్రాన్ని కె ఎస్ రవి కుమార్ దర్శకత్వంలో చేస్తున్న బాలయ్య తన 103 వ చిత్రాన్ని ఎన్టీఆర్ బయో పిక్ నే చేస్తానని కూడా ప్రకటించాడు. కానీ దర్శకుడు ఎవరనేది మాత్రం క్లారిటీ ఇవ్వలేదు.

అయితే ఇప్పటికే స్క్రిప్ట్ వర్క్ పనులు ఫైనల్ స్టేజ్ కి వచ్చేసిన ఈ ఎన్టీఆర్ బయో పిక్ ప్రాజెక్ట్ దర్శకుడు తేజ చేతికి రాబోతుందనే న్యూస్ ఫిలింనగర్ సర్కిల్స్ లో చక్కర్లు కొడుతోంది. ఇక బాలకృష్ణ మాత్రం ఎన్టీఆర్ బయో పిక్ ని పూరి దర్శకుడిగా చేస్తాడని అనుకున్నారు. ఎందుకంటే 103 వ చిత్ర దర్శకత్వ బాధ్యతలు పూరికి ఇచ్చినట్లుగా దానికి పూరి కూడా నిజమే అన్నట్లుగా వార్తలొచ్చాయి. అయితే ఇప్పుడు మాత్రం బాలయ్య దృష్టి తేజపై పడిందని.. ఇప్పటికే బాలకృష్ణ నుంచి పిలుపు కూడా తేజకు వెళ్లిందని టాక్ నడుస్తుంది. ఇక అన్నీ ఫైనల్ అయితే గనక ఎన్టీఆర్ బయో పిక్ ని తెరెకెక్కించే దర్శకుడిగా తేజ పేరుని బాలకృష్ణ అధికారికంగా ప్రకటించే అవకాశాలు ఉన్నాయంటున్నారు. చూద్దాం తేజ ఫిట్ ఎలా ఉందొ.

Similar News