ఒక్క హిట్ కే 150 కోట్ల రూపాయలా?

Update: 2016-10-23 10:21 GMT

యూ.వి.క్రియేషన్స్ సంస్థ చిత్ర పంపిణి నుంచి నిర్మాణ రంగంలోకి అడుగుపెడుతూనే కొరటాల శివ ని దర్శకుడిగా పరిచయం చేస్తూ మిర్చి చిత్రం తీసి విజయవంతం అయ్యారు. తదుపరి రెండవ చిత్రం రన్ రాజా రన్ కూడా నూతన దర్శకుడు సుజిత్ కి అవకాశం ఇచ్చి విజయం అందుకున్నారు. కాగా సుజిత్ తన రెండవ చిత్రంగా ప్రభాస్ కోసం ఒక కథ సిద్ధం చేసి, అటు హీరో ప్రభాస్ నుంచి, ఇటు నిర్మాతలు యూ.వి.క్రియేషన్స్ సంస్థ నుంచి అంగీకారం పొందాడు. బాహుబలి చిత్రం ఆలస్యం అవుతుండగా సుజిత్ చిత్రం ఇప్పటికీ సెట్స్ పైకి వెళ్లలేకపోయింది.

కథ చెప్పినప్పుడు నిర్మాతల దగ్గర 50 కోట్ల రూపాయల వ్యయంతో తెరకెక్కించే విధంగా ఒప్పందం చేసుకున్నాడు సుజిత్. ఇది బాహుబలి విడుదల కాక ముందు సంగతి. మరి ఇప్పుడు బాహుబలి పుణ్యమా అని ప్రభాస్ కి ఉత్తరాదిన, దక్షిణాన పొరుగు భాషలలో కూడా విపరీతమైన గుర్తింపు రావటంతో, నిర్మాతలు సుజిత్ చెప్పిన కథను తెలుగు తో పాటు ప్రభాస్ కి బాగా మార్కెట్ జరిగే పలు భాషల్లో విడుదల చెయ్యటానికి యోచిస్తున్నారంట. దీనికోసం అనుకున్న చిత్ర వ్యయాన్ని ఏకంగా మూడు రేట్లు పెంచేశారు.

సుజిత్ మొదటి చిత్రం ఐన రన్ రాజా రన్ 6 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించబడింది. అటువంటిది రెండవ చిత్రం ఒకేసారి 150 కోట్ల వ్యయం కావటంతో అందరూ నోరెళ్లబెడుతున్నారు.

Similar News