ఒక్క సాంగ్ కోసం కోటిన్నర!!

Update: 2017-06-30 22:30 GMT

మహేష్ బాబు స్పైడర్ చిత్రం షూటింగ్ పూర్తయ్యిందని అంటున్నారు. మరొక వైపు రెండు పాటల బ్యాలెన్స్ అంటున్నారు. ఇకపోతే షూటింగ్ మొత్తం కంప్లీట్ అయినప్పటికీ ఇంకా కొంత టాకీ పార్ట్ షూట్ చేయవలిసి ఉంది. అందుకే మహేష్ కూడా స్పైడర్ కోసం తన డేట్స్ అడ్జెస్ట్మెంట్ చేసాడు. ఇక మహేష్ డేట్స్ సర్దుబాటు చేసింది స్పైడర్ లో మిగిలిన రెండు సాంగ్స్ కోసమేనట. మరి ఈ రెండు సాంగ్స్ ని జులై మొదటివారం నుండి షూట్ చేయబోతున్నారట. ఇక ఈ రెండు సాంగ్స్ కి దాదాపు ఒక 20 రోజులుదాకా పట్టొచ్చని అంటున్నారు.

అయితే ఈ పాటల కోసం డైరెక్టర్ మురుగదాస్ కోటిన్నర ఖర్చు పెట్టి నిర్మించిన సెట్లో 80 మంది డాన్సర్లు తో ఒక పాటను తెరకెక్కిస్తున్నట్టు ప్రచారం జరుగుతుంది. ఇప్పటికే ఆ భారీ సెట్ ని నిర్మించారని... జులై 4 నుండి ఈ పాట షూటింగ్ జరుగుతుందని చెబుతున్నారు. మరి టాలీవుడ్ టాప్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ మొదటిసారి మహేష్ తో జోడి కడుతుంది. ఇక మహేష్ ఈ రెండు సాంగ్స్ లో కొత్త స్టెప్స్ తో డాన్స్ ఇరగదీస్తాడని చెబుతున్నారు. అలాగే స్పైడర్ చిత్రానికి హరీష్ జై రాజ్ మ్యూజిక్ మరో అదనపు ఆకర్షణగా చెబుతున్నారు.

ఇక సెప్టెంబర్ 27 న దసరా కానుకగా విడుదల చేయనున్న స్పైడర్ చిత్రం ఇప్పటికే ఒక టీజర్ రిలీజ్ చేసింది. ఆ టీజర్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇక ఇపుడు సినిమాపై మరిన్ని అంచనాలు పెంచేందుకు మరో టీజర్ ని విడుదల చెయ్యాలని మురుగదాస్ భావించి రేపు జులై మొదటి వారంలో స్పైడర్ సెకండ్ టీజర్ ని విడుదలచెయ్యడానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నాడట.

Similar News