ఒకే ఫ్యామిలిలో మూడు నిర్మాణ సంస్థలు?

Update: 2017-12-26 08:33 GMT

స్టార్ హీరోయిన్ గా ఉన్న సమంత.... హీరో నాగ చైతన్య తో పెళ్లి తరువాత పూర్తి స్థాయి అక్కినేని కోడలిగా మారిపోయింది. అయితే అక్కినేని ఫ్యామిలీ లోకి వెళ్ళాక సమంత ఒక కొత్త అవతారం ఎత్తబోతుంది. అది కూడా ప్రొడ్యూసర్ గా.... అవును సమంత త్వరలో నాగ చైతన్య తో కలిసి ఒక కొత్త ప్రొడక్షన్ హౌస్ ని స్టార్ట్ చేయబోతుంది అని ఫిలిం నగర్ టాక్. కన్నడలో హిట్ మూవీ అయిన 'యూటర్న్'ని తెలుగులో సమంతా రీమేక్ చేస్తుంది. చైతుతో కలిసి ఓ కొత్త బ్యానర్ స్థాపించి.... ఆ బ్యానర్ లో మొదటి సినిమా గా ఈ మూవీ ని నిర్మించాలని అనుకుంటుంది సమంతా.

మరి ఇది ఎంతవరకు నిజమనేది తెలియాలి అంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే. అయితే ఇదిలా ఉంటే ఇప్పటికే అన్నపూర్ణ స్టూడియోస్ పై మూవీస్ ని ప్రొడ్యూస్ చేస్తున్న నాగార్జున…. కొత్తగా 'మనం' అనే పేరు వచ్చేలా మనం ఎంటర్ ప్రైజెస్ అని స్థాపించి 'హలో' మూవీ ని ప్రొడ్యూస్ చేసాడు నాగార్జున. ఈ మనం ఎంటర్ ప్రైజెస్ పై నాగ చైతన్య ఇంకా అఖిల్ తో కలిసి మూవీస్ ని ప్రొడ్యూస్ చేస్తాడట నాగార్జున. ఇప్పుడు ఈ బ్యానర్ కాకుండా ఆ కుటుంబం నుంచి మరో బ్యానర్ ని సమంతా ఏర్పాటు చేస్తుండటంతో అక్కినేని ఫాన్స్ ఫుల్ హ్యాపి గా ఉన్నారు.

ఈ లెక్కన అక్కినేని ఫ్యామిలీ నుండి అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్, మనం ఎంటర్ ప్రైజెస్, ఇపుడు కొత్తగా నాగ చైతన్య - సమంత ల నిర్మాణ సంస్థ తో కలిపి 3 నిర్మాణ బ్యానర్స్ అవుతాయన్నమాట.

Similar News